Home » ఎల్లోరా కైలాస మందిరం: పై నుంచి కిందికి ఇదెలా సాధ్యమైందో.!

ఎల్లోరా కైలాస మందిరం: పై నుంచి కిందికి ఇదెలా సాధ్యమైందో.!

by Mudra369 Editorial Desk
0 comments
ellora caves kailash temple

Ellora Caves Kailash Temple.. ఏ నిర్మాణమైనా కట్టడమైనా బేస్‌మెంట్ నుంచి స్టార్ట్ చేయాలి.

అదేనండీ.! నేలను తవ్వాలి. బేస్‌మెంట్ వెయ్యాలి. దాని ఆసరాగా పై పైకి కట్టడాన్ని కావల్సిన విధంగా పూర్తి చేసుకుంటూ పోవాలి.

అలా కాకుండా.. పై నుంచి కట్టుకుంటూ కిందకి రావడమేంటీ.? అదెలా సాధ్యం. ! అందుకే ఈ కట్టడం అంత ప్రత్యేకం. అదో పెద్ద కొండ.

దాదాపు 100 అడుగుల ఎతైన ఆ కొండ అంచు నుంచి కిందకి చెక్కుెకుంటూ ఓ అద్భుతమైన కట్టడాన్ని రూపొందించారు.

అదే ఎల్లోరాలోని కైలాస మందిరం. అజంతా ఎల్లోరా గుహలు ప్రత్యేకమైన శిల్ప కళాకృతులకు పెట్టింది పేరు. అలాగే ఈ గుహల ఆర్కిటెక్చర్ అద్భుతం కూడా నెక్స్ట్ లెవల్.

Ellora Caves Kailash Temple.. వర్టికల్ ఎక్స్‌కవేషన్

అయితే, ఇక్కడి కైలాస మందిరం గురించి ఇంకా స్పెషల్‌గా మాట్లాడుకోవాలి మరి.

ఎలాంటి సిమెంట్, ఇసుక అవసరం లేకుండా నిటారుగా వున్న ఓ నల్లరాతి కొండను తొలిచి లోెపల వున్న అనవసరమైన రాతిని తొలిగించి మిగిలిన శిలనే ఆలయంగా మలిచారు.

అందుకే ఈ ఆలయం ప్రపంచ వాస్తు కళా చరిత్రలోనే కనీ వినీ ఎరుగని ఓ అద్భుత సృష్టిగా నిలిచింది. ఎల్లోరాలోని గుహ నెంబర్ 16 ఈ కైలాస మందిరం కొలువైన ప్రదేశం.

ellora caves kailash temple
ellora caves kailash temple

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ సమీపంలో వున్న ఈ ఏక శిలా నిర్మాణం ప్రాచీన ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం.

కైలాస ఆలయం నిర్మించిన పద్థతిని ఆర్కిటెక్చర్ పరిభాషలో ‘వర్టికల్ ఎక్స్‌కవేషన్’ అంటారు. అంటే కొండ నెత్తి మీద నుంచి కింది వరకూ ఆలయ గర్భ గుడి వరకూ అన్నమాట.. ఏకధాటిగా చెక్కుకుంటూ రావడం.

ఎంత చిత్రమో తెలుసా.!

ఈ ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి పట్టిన సమయం దాదాపు 100 సంవత్సరాలని అంటుంటారు. కేవలం కొన్ని పరిశోధనల ఆధారంగా కనుగొన్న అంచనా మాత్రమే ఇది.

మొత్తం 34 (అధికారికంగా ప్రజల సందర్శనార్ధం వుంచిన గుహలు) ఎల్లోరా గుహల సముదాయంలో 16 వ గుహలో ఈ కైలాస మందిరం నిర్మితమైంది..

పై నుంచి కిందికి కొండను చెక్కుతూ వచ్చే క్రమంలో ఎలాంటి కొలతల మార్జిన్ లేదు. డ్రాయింగ్ ప్లాన్ లేదు. సాఫ్ట్‌వేర్ సాంకేతికత లేదు.

అలాంటిది శిల్పులు ఉపయోగించి తమ సుత్తి ఖచ్చితత్వం నేటికీ ఆధునిక సివిల్ ఇంజనీర్లను విస్మయానికి గురి చేస్తుంది.

ellora caves kailash temple
ellora caves kailash temple

రాతి కట్టడం అంటే.. ఏదైనా తప్పు జరిగితే, ఆ రాయిని తీసి మరొకటి అమర్చే అవకాశం వుంటుందేమో.

కానీ, ఈ ఏకశిలా కట్టడంలో ఒక్క చిరు లోపం జరిగినా, శిల్లి సుత్తి దెబ్బ కాస్త అటూ ఇటూ తడబడినా మొత్తం ఆలయం సమతుల్యతే దెబ్బ తింటుంది.

ఇంత భారీ కొండను చెక్కి ఆలయ రూపం తీసుకొచ్చే క్రమంలో దాదాపు 2 లక్షల నుంచి 4 లక్షల టన్నుల వేస్ట్ రాతి ముక్కలు తొలగించాల్సి వుంటుందని అంచనా.

మిగిలిన రాతి శిథిలాల ఆనవాళ్లేవీ.!

నేటి ఆధునిక లెక్కల ప్రకారం రోజుకు సగటున పదుల కొద్దీ టన్నుల రాతిని తొలగించాల్సి వుంటుంది.

కానీ, అన్ని సంవత్సరాల్లో ఇన్ని లక్షల టన్నుల రాతి శిథిలాలను తొలగించి ఎక్కడ పడేశారు.. అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఎల్లోరా గుహల పరిసరాల్లో ఎక్కడా ఈ రాతికి సంబంధించిన చిన్న శిథిలాల ఆనవాలు కూడా కనిపించకపోవడం మరింత ఆశ్చర్యకరమైన విషయం.

ప్రధాన ఆలయం నేల మీద ఆనుకొని వుండదు. భారీ ఏనుగులు, సింహాలూ తమ భుజాలపై ఆలయాన్నిమోస్తున్నట్లుగా అనిపిస్తుంది.

అలాగే ప్రాంగణం నుంచి చూస్తే.. రెండు భారీ ఏక శిలా స్థంభాలు కూడా ఈ కట్టడం మొత్తాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాయా అన్నట్లు తోస్తుంది.

ఈ ఆలయంలో ఎన్నో ప్రపంచ ప్రసిధ్ది చెందిన శిల్పాలు చెక్కబడి వున్నాయి. ఔరంగజేబు కాలంలో హిందూ దేవాలయాలెన్నో నాశనమైన సంగతి తెలిసిందే.

ప్రాచీన భారతం ఆధునిక సాంకేతికతకు అందించిన అపురూప కానుక..

కానీ, ఈ ఆలయాన్ని కొన్ని సంవత్సరాల పాటు ఏక ధాటిగా నాశనం చేయడానికి వందలు, వేల మంది సైన్యంతో యత్నించాడు. కానీ, సాధ్య పడలేదు.

నేలపై కట్టిన కట్టడాన్ని అయితే కదిలించొచ్చు. బాంబులు పెట్టి పేల్చేయొచ్చు. కానీ, నేల అట్టడుగు నుంచి పుట్టిన కొండని నాశనం చేయడం మానవ సాధ్యం కానే కాదు.

ellora caves kailash temple
ellora caves kailash temple

అందుకే కొన్ని శతాబ్ధాలుగా ఈ కట్టడం చెక్కు చెదరకుండా హిందూ సనాతన ధర్మానికి నిలువెత్తు సాక్ష్యంగా అలాగే నిలిచి వుంది.

అందుకే కైలాస మందిరం కేవలం ఒక పుణ్య క్షేత్రం కాదు. అదో మానవ సంకల్పం. ప్రకృతి అద్భుతం. అసాధారణ గణిత పరిజ్ఞానానికి నిలువెత్తు సాక్ష్యం.

భూగర్భ నిర్మాణ శాస్త్రాల సంగమం. ప్రాచీన భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యున్నత ఇంజనీరింగ్ బహుమతి.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group