Sreeleela Fashion Trends.. ‘ఆర్టిఫిషియల్’ ఈ పదం ఫ్యాషన్ రంగంలో చాలా ఫాపులర్ అయిపోయింది.
అమ్మాయిలు తమ అందాన్ని పెంచుకోవడానికి ఆర్టిఫియషియల్ యాక్సెసరీస్‌ని చాలా సులభంగా వాడేస్తుంటారు.
ఈ ట్రెండ్ నయా కాలంలో చాలా ఎక్కువయిపోయింది. గోళ్లను అందంగా చూపించడానికి వాటికి గోళ్ల రంగులు (నెయిల్ పాలిష్) వేసుకునేవారు.
ఆ నెయిల్ పాలిష్.. ఇంకాస్త అప్డేట్ అయ్యింది ‘నెయిల్ ఆర్ట్’ అని. ఈ నెయిల్ ఆర్ట్‌లో భాగంగా రకరకాల డిజైన్లు అమ్మాయిల గోళ్లపై అందంగా నాట్యం చేస్తున్నాయ్.
వాటి ప్లేస్‌లో ఆర్టిఫిషియల్ గోళ్లు వచ్చేశాయ్. అందంగా షేప్ చేసిన గోళ్లపై నెయిల్ ఆర్ట్ వేస్తే బాగుంటుంది.
అయితే, ఇప్పుడు తీసుకుంటున్న ఫుడ్.. ఇతరత్రా కారణాలతో సహజ సిద్ధమైన గోళ్లు ఆరోగ్యంగా అందంగా పెరగడం లేదు.
Sreeleela Fashion Trends.. నయా నెయిల్ ట్రెండ్ – గోరు వుంగరాలు (గోల్డెన్ నెయిల్ క్లాస్)
తద్వారా వాటితో నచ్చిన రీతిలో ఫ్యాషన్లు చేయడం కుదరడం లేదు. అందుకే వాటి స్థానాన్ని రీ ప్లేస్ చేస్తున్నాయ్ ఆర్టిఫిషియల్ నెయిల్స్. ‘నెయిల్ క్లా’ అంటున్నారు వీటిని.
ఆర్టిఫిషియల్ నెయిల్స్‌లో భాగంగా గోళ్లకు గ్లూ తో అతికించే అనేక రకాల డిజైన్లున్నాయ్. అయితే ఈ గోల్డెన్ క్లాస్ మాత్రం వుంగరాల్లా నచ్చినప్పుడు ధరించి తీసి దాచుకోవచ్చు.

వేలికి చివర రింగుల్లాంటి సెట్టింగ్స్ వుంటుంది వీటికి. అందుకే వేలి వుంగరంలా వీటిని ధరించేయొచ్చు. గోల్డెన్ జ్యూయలరీలో ఒక పార్ట్‌గా వీటిని చేర్చారు.
ఈ ఫోటోల్లో శ్రీలీల ధరించినవి ఈ గోల్డెన్ క్లా రింగ్సే. గ్లామర్ ప్రపంచంలో తమని తాము ప్రత్యేకంగా ప్రజెంట్ చేసుకోవడానికి ఈ గోల్డెన్ నెయిల్ క్లా రింగ్స్ జ్యూయలరీలో భాగంగా దోహదం చేస్తాయ్.
మామిడి పిందెల జాకెట్టు – చేస్తోంది ఏదో కనికట్టు
ఇక ఈ ఫోటోలో శ్రీలీల ధరించిన నెమలి పింఛం రంగు రాయల్ శారీకి ఆమె డిజైన్ చేయించుకున్న బ్లౌజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
సాధారణ బ్లౌజ్ కట్ డిజైన్ కాదిది. పెద్ద పెద్ద మామిడి పిందెల డిజైన్‌తో రూపొందించబడిన 3డి స్కల్ప్రెడ్ బ్లౌజ్. ఈ జాకెట్టుకు ముత్యాల పూసలతో చేసిన బీడ్స్ వర్క్ మరో హైలైట్.

మెడలో ఎలాంటి జ్యూయలరీ ధరించే పని లేకుండా ఈ బ్లౌజ్ డిజైన్ ఫుల్ స్పేస్ ఆక్యుపై చేసేసింది. అలాగే చీరలోనూ ముత్యాల డిజైన్ శ్రీలీల రిచ్ లుక్‌ని రాయల్ లుక్స్‌లోకి మార్చేసింది.
చెవి మొత్తాన్ని కవర్ చేసేసేలా చెవులకు ధరించిన పూల తీగల్లాంటి ఇయర్ కఫ్స్ శ్రీలీల ట్రెండింగ్ ఫ్యాషన్ సెన్స్‌ని వేరే లెవల్లో ఎగ్జిబిట్ చేస్తోంది.
తెరపై తనదైన అందం, అభినయంతో పాటూ, ఆకర్షణీయమైన డాన్సులతో ఆకట్టుకునే శ్రీలీల ఈ నయా ఫ్యాషన్ ట్రెండ్ నెట్టింట తెగ వైరల్ అవుతోందిప్పుడు.