Mrunal Thakur Jadal Glamour.. ‘ఓ వాలు జడా.. మల్లెపూల జడా..’ అంటూ కవులు అందమైన అమ్మాయిల వాలు జడలపై అబ్బో.! బోలెడన్ని కవితలూ, కవిత్వాలూ అల్లేశారు.
అప్పుడూ, ఇప్పుడూ ఎప్పుడూ ఆ వాలు జడకున్న క్రేజ్ వేరే లెవల్ అంతే మరి.
అయితే, ఇప్పుడు పూల జడలకు కాస్త కాలం చెల్లిందని చెప్పొచ్చేమో. వాటి ప్లేస్‌లో మెటాలిక్ మెరుపులు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయ్.
పూసలు, మెరుపుల దారాలు.. జడ క్లిప్పుల రూపంలో హెయిర్ బ్యాండ్స్ రూపంలో తమదైన ప్లేస్ ఆక్యుపై చేస్తున్నాయ్.
మనం మాట్లాడుకోబోయేది ‘బంగారు తీగల జడ’. అదేనండీ ఫ్యాషన్ కొత్త పుంతలు తొక్కుతున్న వేళ రకరకాల హెయిర్ స్టైల్స్ అందుబాటులోకి వచ్చాయ్.
అలాగే ఆర్టిఫిషియల్ జడలు కూడా. ఎప్పటి నుంచో అందుబాటులో వున్నాయనుకోండి. అయితే ఇప్పుడు ఇంకాస్త డిఫరెంట్. సరికొత్త లుక్స్‌లో మెరిసిపోవడానికి రకరకాల ట్రెండ్స్ ఫాలో చేస్తున్నారు.
Mrunal Thakur Jadal Glamour.. బంగారు జడల్ మృణాల్ మెరుపుల్
కొత్త రకమైన ట్రెండ్స్ సెట్ చేస్తున్నారు. చక్కనమ్మలు ఏం చేసినా ముద్దుగానే వుంటుంది కదా.! ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ లేటెస్ట్‌గా ఓ న్యూ ట్రెడిషనల్ లుక్‌లో దర్శనమిచ్చి నెట్టింట తెగ ట్రెండ్ అయిపోతోంది.
అదేంటో.! అటు ట్రెడిషనల్ వేర్ అయినా.. ఇటు ట్రెండీ వేర్ అయినా ఇట్టే సూటయిపోోతుంది ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్‌కి. తాజాగా ఓ ట్రెడిషనల్ వేర్ ధరించింది.
బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ అది. గాగ్రా చోలీని తలపిస్తోంది. ఈ కాస్ట్యూమ్‌లో ధగధగా మెరిసిపోతోంది మ)ణాల్.

బంగారు బోర్డర్ మరియు మిర్రర్ వర్క్‌లో డిజైన్ చేసిన దుప్పట్టా ఈ గాగ్రా చోలీకి అదనపు ఆకర్షణ కాగా, మృణాల్ ఫాలో చేసిన హెయిర్ స్టైలే ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది.
మిడిల్ పార్టిషన్‌తో వేసిన ఓ మామూలు అల్లికల జడ. అయితే, ఆ అల్లికల్ని బంగారు తీగలతో అల్లేశారు. అందుకే ఈ జడ అంత స్పెషల్. మృణాల్ సాంప్రదాయమైన లుక్‌ని ఈ బంగారు తీగల జడ ఎక్కడికో తీసుకెళ్లిపోయింది.
ఏం చేస్తాం.! పూల జడల క్రేజ్ కాస్త తగ్గి, వాటి స్థానాన్ని ఇదిగో ఇలాంటి మెటాలిక్ మెరుపులు ట్రెండీగా ఆక్రమించేశాయ్ కదా.!
ఇవే ఇప్పుడు యూత్‌ని ఈజీగా కట్టి పడేస్తున్నాయ్. ట్రెడిషనల్ వేర్‌లోనూ ఇలాంటి ట్రెండ్స్ సింపుల్‌గా సెట్ అయిపోతున్నాయ్.
చెక్కిన శిల్పంలా.!
అదే ఇప్పుడు మృణాల్‌ని చూస్తే.. తాను ధరించిన ట్రెడిషనల్ వేర్‌కి ఈ గోల్టెన్ తీగల జడ ఎంత ట్రెండీ లుక్ ఆపాదించేసిందో కదా.!
హెవీగా డిజైన్ చేసిన బోర్డర్ దుపట్టా మెడలో ఆభరణాలకు చోటివ్వలేదు. అదే హైలైట్ చేసేస్తోంది.
చెవులకు ధరించిన లాంగ్ అండ్ హెవీ ఇయర్ రింగ్స్ మృణాల్ ముఖానికి మరింత అందాన్ని తెచ్చిపెట్టాయ్. అలాగే ‘మీనా మీనా..’ఆమె కాటుక కళ్లు ఓవరాల్ రాయల్ లుక్‌ని ఎలివేట్ చేస్తున్నాయ్.
చక్రాల్లాంటి కళ్లకు అద్దిన ఐ లైనర్.. ఆమె చూపుల్ని మరింత షార్ప్‌గా మార్చేయడంతో పాటూ, మృణాల్ నిలబడిన వైనం.. రాజసాన్ని తలపిస్తూ అందమైన శిల్పంలా ప్రతిబింబిస్తోంది.