Table of Contents
ప్రభాస్ (Rebel Star Prabhas) అంటే పాన్ ఇండియా స్టార్. అలాంటి ప్రభాస్ పెద్ద షాకే ఇచ్చాడు. అవును, ఇది ఎవరూ ఊహించని షాక్. ప్రభాస్ చెప్పిన ఆ మాట వింటే ఎవరైనా షాక్ (Rebel Star Prabhas Saaho Shock) అవ్వాల్సిందే. ఇంతకీ ప్రభాస్ ఇచ్చిన ఆ స్టేట్‌మెంట్ ఏంటి.? ఎందుకు ఆ స్టేట్‌మెంట్ అందరికీ అంద పెద్ద షాక్ ఇస్తోంది.?
అసలు విషయమేంటంటే, ‘బాహుబలి’ (Baahubali) తర్వాత, ‘సాహో’ (Prabhas Shraddha Kapoor) కోసం ప్రభాస్ చాలా ఎక్కువ సమయం తీసుకోవాల్సి వచ్చింది. ‘మిర్చి’ నుంచి ‘సాహో’ వరకూ మధ్యనున్న గ్యాప్‌లో ప్రభాస్, ఏడాదికి రెండు సినిమాలు చేసినా, చాలా సినిమాలు వచ్చేసేవి.
కానీ, ఎన్ని సినిమాలు చేసినా ‘బాహుబలి’ రేంజ్ వచ్చేది కాదు. ‘సాహో’ (Saaho Review) లాంటి సాహసం ప్రభాస్ చేయాల్సి వచ్చేది కాదు. అయితే, ఇకపై అలాంటి రిస్క్‌లు తీసుకోనని ప్రభాస్ చెబుతున్నాడు. భారీ బడ్జెట్ సినిమాల జోలికి వెళ్ళబోడట.
ఎందుకంటే, ప్రతి సినిమాకీ పెరిగిపోతోన్న అంచనాల్ని తట్టుకోలేకపోతున్నానని ప్రభాస్ తన మనసులో మాట చెప్పేశాడు. ‘సాహో’ (Saaho Preview) ఎంత వసూలు చేస్తుందో తెలియదు, కానీ, ‘బాహుబలి’ అభిమానుల్ని మాత్రం నిరాశపరచదు.. అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ చెప్పుకొచ్చాడు.
సో, మేటర్ క్లియర్. ప్రభాస్ ఇకపై పెద్ద సినిమాలు చేయబోడు. అంటే, దానర్థం 200 కోట్లు, ఆ పైబడి సినిమాలు చేయడేమోనని అర్థం చేసుకోవాలి. కానీ, 100 కోట్ల బడ్జెట్‌ని పెట్టుకుని ప్రభాస్ ఓ సినిమా చేయడం సాధ్యమేనా.? ఛాన్సే లేదు. ప్రభాస్‌తో సినిమా అంటే ఏ నిర్మాత అయినాసరే, ఖర్చుకి వెనుకాడడు.
Click Here: ‘సైరా’ వెర్సస్ ‘సాహో’ ఎవరి దమ్మెంత.?
మరి, ప్రభాస్ ఎలా లిమిటెడ్ బడ్జెట్‌లో సినిమా చేయాలనుకుంటున్నాడు.? కారణం ఏదైనా, ప్రభాస్ ‘సాహో’ (Saaho) సినిమాతో టెన్షన్ ఫీలవుతున్నాడనే విషయం స్పష్టమవుతోంది. మొన్నేమో, ‘సాహో’ నిర్మాతలు డబ్బుల గురించి ఆలోచించి వుంటే 100 కోట్లు మిగిలేవని చెప్పాడు.
Click Here: Jacqueline’s Hot Show For ‘Bad Boy’ Saaho
‘సాహో’ నిర్మాతలంటే, ప్రభాస్‌కి స్నేహితుల కింద లెక్క. ఆ స్నేహితుల మంచి గురించి ప్రభాస్ ఎంత బాగా ఆలోచించాడో కదా.! ఏదిఏమైనా, ‘బాహుబలి’ తర్వాత వరుసగా సినిమాలు చేస్తానని ప్రకటించిన ప్రభాస్ (Rebel Star Prabhas Saaho Shock), చేయడమైతే చేశాడుగానీ, ‘సాహో’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికే చాలా టైమ్ తీసుకున్నాడు.
Click Here: ‘సాహో’రే.. ప్రభాస్ స్టామినా ఎంత.?
నెక్స్‌ట్ రాధాకృష్ణ డైరెక్షన్‌లో ఓ సినిమా నిర్మాణంలోనే వుంది. పూజా హెగ్దే (Pooja Hegde) అందులో హీరోయిన్. ‘సాహో’ విడుదలయ్యాక పూర్తిగా ఆ సినిమాపై ఫోకస్ పెడ్తాడు ప్రభాస్.