‘సాహో’ (Saaho Review) సినిమాని ఎందుకు ‘బాహుబలి’తో (Baahubali) పోల్చకూడదు.? అన్న చర్చ గట్టిగానే జరుగుతున్నా, ప్రభాస్ మాత్రం ఆ పోలిక వద్దంటున్నాడు. ఎందుకని.? ‘బాహుబలి’ని ప్రత్యేకమైన సినిమాగానే చూడాలని చెబుతున్న ప్రభాస్ మాటల్లోని మర్మమేమిటి.? ‘సాహో’ మీద అపనమ్మకమా.? ‘బాహుబలి’ మీద అపారమైన నమ్మకమా.? ఇంతకీ, ప్రభాస్ ‘సాహో’తో ఏం చేయబోతున్నాడు?
ఆగస్ట్ 30న విడుదల కాబోతోన్న ‘సాహో’పై ఆకాశమంతెత్తున అంచనాలు పెరిగిపోయాయ్.. ఇంకా పెరిగిపోతూనే వున్నాయ్.
Click Here: ‘సాహో’రే.. ప్రభాస్ స్టామినా ఎంత.?
ఎంత ఎదిగినా ఒదిగి వుండడం చిరంజీవి నుంచి నేర్చుకున్నానని చెప్పే ప్రభాస్, ‘బాహుబలి’ సినిమాతో వచ్చిన ఖ్యాతి తనకెప్పుడూ అలాగే వుంటుందని చెబుతూనే, అంత పెద్ద విజయాన్నిచ్చిన దర్శకుడు రాజమౌళి ఎంతో కూల్‌గా వుంటాడనీ, దాన్ని తాను అలవర్చుకున్నాననీ చెప్పడం గమనార్హం.
ఇక, ‘సాహో’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. సినీ జర్నలిస్ట్ ఉమైర్ సంధు, ఆల్రెడీ ‘సాహో’ సినిమా చూసేశాడు. గల్ఫ్ దేశాల్లో సెన్సార్ సందర్భంగా సినిమా చూసిన ఉమైర్ సంధు, ఈ సినిమాకి సూపర్బ్ రివ్యూ ఇచ్చాడు.
Click Here: బిగ్ షాక్: ప్రభాస్ వర్రీస్.. కారణం అదేనా?
ప్రభాస్ ఇంతకు ముందెన్నడూ కనిపించని కొత్త తరహా పాత్రలో కన్పించబోతున్నాడనీ, యాక్షన్ హీరోగా ప్రభాస్ అదరగొట్టేశాడనీ, ‘సాహో’ సినిమా దెబ్బకి ‘బాహుబలి’ రికార్డులు బద్దలైపోతాయనీ, ప్రభాస్, ‘సాహో’తో సరికొత్త రికార్డులు సృష్టించబోతున్నాడనీ పేర్కొన్నాడు ఒమైర్ సంధు.
ఇకనేం, ప్రభాస్ (Young Rebel Star Prabhas) అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ‘సాహో’ దెబ్బకు ‘బాహుబలి’ రికార్డులు ఔట్.. అంటూ చెలరేగిపోతున్నారు ప్రభాస్ అభిమానులు.
మరోపక్క, ట్విట్టర్‌లో సినిమా డిటెయిల్స్‌ని ఉమైర్ సంధు పేర్కొనడాన్ని మాత్రం ప్రభాస్ అభిమానులు తప్పుపడుతున్నారు. నెగెటివ్ క్యారెక్టర్‌ని ప్రభాస్, ‘సాహో’లో చేశాడన్నది ఉమైర్ సంధు ట్వీట్ సారాంశం.
ఇది సినిమాలో ‘కీ’ పాయింట్ కాబోతోంది. దీన్ని చిత్ర యూనిట్ ఇప్పటిదాకా సస్పెన్స్‌గా వుంచింది. అది కాస్తా ఇప్పుడు రివీల్ అయిపోవడం గమనార్హం. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాహో’ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor)హీరోయిన్‌గా నటిస్తున్న విషయం విదితమే.
జాక్వెలైన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez) ‘బ్యాడ్ బాయ్’ సాంగ్‌లో మెరిసింది. జాకీష్రాఫ్, మందిరా బేడీ, నీల్ నితిన్ ముఖేష్.. ఇలా చాలామంది ప్రముఖులు ‘సాహో’ సినిమాలో నటించారు.