బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut Bold And Wild), ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది. స్పృహలో వుండి మాట్లాడుతోందో.. ఏదన్నా మైకంలో వుంటోందోగానీ.. ఆమె నుంచి వస్తోన్న ఒక్కో మాట అత్యంత దారుణంగా వుంటోంది. కొన్నాళ్ళ క్రితం హీరోయిన్ తాప్సీని ఉద్దేశించి ‘బి-గ్రేడ్ నటి’ అంటూ విమర్శించింది.
అసలు, ఏ నటి గ్రేడ్ ఏంటన్నది డిసైడ్ చేయడానికి కంగనా రనౌత్ ఎవరు.? పైగా, ‘బి-గ్రేడ్’ సినిమాలు, అంతకన్నా నీఛమైన సినిమాలు చేయడంలో కంగనా రనౌత్‌కే గొప్ప ట్రాక్ రికార్డ్ వుంది. కెరీర్ తొలినాళ్ళలో ఆమె చేసిన సినిమాలన్నీ అలాంటివే.
Also Read: అనసోయగం.! ఎలా.. ఇంతందంగా ఎలా.?
ఇక, తాజాగా ఊర్మిళ మతోంద్కర్ని ఉద్దేశించి ‘శృంగార తార’ (అడల్ట్ స్టార్, సాఫ్ట్ పోర్న్ సినిమాలు చేసిన నటి అనే అర్థం వచ్చేలా) వ్యాఖ్యలు చేసింది కంగనా రనౌత్. ఊర్మిళ ఒప్పటికి గ్లామరస్ హీరోయిన్. అయితే, ఆమె చాలా హిట్ సినిమాల్లో నటించింది. గ్లామర్ అనేది సినిమాల్లో కామన్.

ఆ మాటకొస్తే, కంగనా రనౌత్‌ని మించిన గ్లామర్ అయితే ఊర్మిళ పండించి వుండకపోవచ్చు. అసలు ఊర్మిళతో పోల్చితే, కంగనది గ్లామర్ కాదు.. అసభ్యకరం అని అంటారు చాలామంది. ‘బాలీవుడ్ – డ్రగ్స్’ అనే అంశం చుట్టూ ‘కంగన రచ్చ’ కొనసాగుతోంది.
Also Read: సుధీర్ – రష్మిల పెళ్లి గోల.. ఇంకెన్నాళ్ళిలా.?
కంగన ఆలోచనలు వేరు కావొచ్చు.. ఇతరుల ఆలోచనలు ఇంకోలా వుండొచ్చు. ఎవరి అభిప్రాయాల్ని వారు వ్యక్తీకరిస్తారు. అంతమాత్రాన, జయాబచ్చన్ లాంటి సీనియర్ నటిపై విరుచుకుపడటమేంటి.? కంగనా రనౌత్ ఇదంతా పబ్లిసిటీ కోసం మాత్రమే చేయడంలేదు, ఇంకేదో ఆశిస్తోందామె.
ఇంతకీ, కంగనా రనౌత్ మానసిక స్థితి సరిగ్గానే వుందా.? ఇది ఇంకో డౌట్ మళ్ళీ. ఎవర్నయినా వేలెత్తి చూపించేముందు, తన చేతిలోని మిగతా నాలుగు వేళ్ళు తనవైపు చూపిస్తున్నాయన్న విషయాన్ని కంగనా రనౌత్ గుర్తు పెట్టుకుంటే మంచిదేమో.
