డ్రగ్స్ వ్యవహారం బాలీవుడ్‌ని కుదిపేస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ అనుమానాస్పద మృతి కేసులోంచి ఈ డ్రగ్స్ ఎపిసోడ్ తెరపైకొచ్చిన సంగతి తెలిసిందే. తొలుత రియా చక్రవర్తి అరెస్ట్, ఆ తర్వాత తాజాగా నలుగురు హీరోయిన్లకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నోటీసులు, ఇంకా కథ (Kangana Ranaut Bollywood Drugs Case) చాలానే వుంది.
నోటీసులు అందుకున్నవారిలో రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పడుకొనే, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్ వున్నారు. మరికొంతమందికి కూడా ఎన్‌సిబి నోటీసులు ఇవ్వనుందనే ప్రచారం జరుగుతోంది. అయితే, తొలుత నోటీసులు ఇవ్వాల్సింది కంగనా రనౌత్‌కి.. అంటూ ఒకప్పటి హీరోయిన్ నగ్మా సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
నగ్మా మాత్రమే కాదు, మరికొందరు కూడా ఇదే డిమాండ్‌ని తెరపైకి తెస్తున్నారు. కొన్నేళ్ళ క్రితం తాను డ్రగ్స్ తీసుకున్నట్లు స్వయానా కంగన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆ లెక్కన కంగనా రనౌత్‌ని కూడా ఎన్‌సిబి ప్రశ్నించాల్సి వుంది. ఎన్‌సిబి ఎందుకు కంగనని పట్టించుకోవడంలేదు? అన్న చర్చ బాలీవుడ్‌లో జరుగుతోంది.
మరోపక్క, కంగనా రనౌత్.. బాలీవుడ్ సినీ ప్రముఖులపై ఆరోపణల పర్వం కొనసాగిస్తూనే వుంది. కొందరు స్టార్ హీరోల భార్యలు కూడా డ్రగ్స్ బాధితులేనని ఆరోపిస్తోంది కంగనా రనౌత్. అయితే, వారి పేర్లను మాత్రం ప్రస్తుతానికి బయటపెట్డలేదు ఈ బాలీవుడ్ భామ. ముందు ముందు కంగన ఆరోపణలు ఈ డ్రగ్స్ ఎపిసోడ్‌కి సంబంధించి మరింత ముదిరి పాకాన పడనున్నాయని నిస్సందేహంగా చెప్పొచ్చు.
అయితే, కంగన డిమాండ్ చేస్తున్నట్లుగానే బాలీవుడ్‌లో సినీ ప్రముఖులందరికీ ‘నార్కోటిక్స్ టెస్టులు’ చేయాల్సిన అవసరం వుందా.? అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. నిజానికి, ఇది అంత తేలిగ్గా సాధ్యమయ్యే పని కాదు. డ్రగ్స్ కేసులోనే అరెస్ట్ అయిన కన్నడ నటి సంజన, వైద్య పరీక్షలకు నిరాకరించిన విషయం విదితమే.