టెస్ట్ సిరీస్ తొలి మ్యాచ్ ఓటమితో ప్రారంభమయ్యింది.. టీ20 సిరీస్ కూడా అదే పరిస్థితి. కానీ, వన్డే సిరీస్ వచ్చేసరికి సీన్ మారింది. విజయంతో వన్డే సిరీస్‌ని ప్రారంభించింది టీమిండియా. కొత్త కుర్రాళ్ళు ప్రసిద్ధ్ కృష్ణ, కృనాల్ పాండ్య.. (Prasidh Krishna Krunal Pandya Debut Super Hit) అరంగేట్రంతోనే అదరగొట్టేశారు.
రోహిత్ శర్మ (Rohit Sharma) కాస్త నిరాశపర్చినా, మరో ఓపెనర్ శిఖర్ ధావన్ రాణించాడు.. కోహ్లీ అర్థ సెంచరీతో ఆకట్టుకున్నాడు. పాపం ధావన్, సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఔటయిపోయాడు. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడ్డాయి. అప్పుడే కృనాల్ పాండ్య, కె.ఎల్.రాహుల్ తమ సత్తా చాటారు.
నిజానికి, టీమిండియా (Team India) 300 పరుగుల పైన స్కోర్ చేస్తుందని ఎవరూ అనుకోలేదు. కానీ, అద్భుతమే జరిగింది.. ఆ అద్భుతానికి కారణం కృనాల్, రాహుల్. కృనాల్ అయితే భయమే లేకుండా ఆడేశాడు. హార్ధిక్ పాండ్య మాత్రం నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్ కూడా ఆకట్టుకోలేకపోయాడు.
ఇక, 318 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు.. మొదట్లో బీభత్సమైన దూకుడు ప్రదర్శించింది. కానీ, చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయింది.
మొదట్లో పరుగులు విపరీతంగా సమర్పించుకున్న కొత్త కుర్రాడు ప్రసిద్ధ్ కృష్ణ (Prasidh Krishna Krunal Pandya Debut Super Hit) అనూహ్యంగా పుంజుకుని 4 వికెట్లు తీయడం గమనార్హం. శార్దూల్ ఠాగూర్ 3 వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) రెండు వికెట్లు, కృనాల్ పాండ్య ఓ వికెట్ తీశాడు.
ఇంగ్లాండ్ 42.1 ఓవర్లలో 251 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ ఆటగాళ్ళలో జేసన్ రాయ్ 46 పరుగులు చేయగా, బెయిర్ స్టో విధ్వంసకరమైన ఇన్నింగ్స్ (66 బంతుల్లో 94 పరుగులు) ఆడాడు. మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో ఇంగ్లాండ్ పరాజయం మూటగట్టుకుంది.