Home » పూజా హెగ్దే “Kicked Stupid ‘Dash’ Butt”

పూజా హెగ్దే “Kicked Stupid ‘Dash’ Butt”

by hellomudra
0 comments
Pooja Hegde Kicked Stupid Covid 19 Butt

బుట్టబొమ్మ పూజా హెగ్దే ఇటీవల కరోనా బారిన పడిన విషయం విదితమే. ఓ హిందీ సినిమా షూటింగ్ సమయంలో పూజా హెగ్దేకి కరోనా సోకిందట. ఎలా సోకిందన్న విషయాన్ని పక్కన పెడితే, ‘కోవిడ్ 19 పాజిటివ్’ (Pooja Hegde Kicked Stupid Covid 19 Butt) అని తేలగానే పూజా హెగ్దే ‘ఐసోలేషన్ మోడ్’లోకి వెళ్ళిపోయింది.

పూజా హెగ్దే అంటేనే ఫిట్ అండ్ పెర్ఫెక్ట్ కదా. దానికి తోడు యోగా చేస్తుంటుంది.. ఆరోగ్యం పట్ల చాలా చాలా శ్రద్ధ వహిస్తుంటుంది. అవన్నీ, ‘ఐసోలేషన్’ సందర్భంగా బాగా ఉపయోగపడ్డాయి పూజా హెగ్దేకి. క్వారంటైన్ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని కొంతమేర స్వయంగా తానే తయారు చేసుకుంది కూడా.

Seeti Maar Song From DJ Allu Arjun Pooja Hegde

అన్నట్టు, హీరో అల్లు అర్జున్ కూడా కరోనా బారిన పడటంతో, ‘బంటు’ కూడా నాలాగే.. అంటూ సెటైరేస్తూనే, అల్లు అర్జున్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించి, అందరి దృష్టినీ ఆకర్షించింది తనదైన చమత్కారంతో. ఇక, అసలు విషయానికొస్తే, పూజా హెద్దే తాజాగా తనకు కరోనా నెగెటివ్ వచ్చిందని ప్రకటించింది.

“Thank you for all the love ya’ll have sent my way. I have recovered well, kicked stupid corona’s butt and finally tested NEGATIVE! 😃 yeyy! All your wishes and healing energy seemed to have done it’s magic. Forever grateful ❤️ Stay safe out there”

Aravinda Sametha Song Jr NTR Pooja Hegde

ఇదిగో, పైన చెప్పుకున్న విధంగా తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది పూజా హెగ్దే, కరోనా నుంచి బయటపడటంపై. కానీ, “kicked stupid corona’s butt ” అంటూ పూజా హెగ్దే పేర్కొనడం అందర్నీ విస్మయానికి (Pooja Hegde Kicked Stupid Covid 19 Butt) గురిచేసింది. సాధారణంగా ఇలాంటి మాటలు రామ్ గోపాల్ వర్మ లాంటోళ్ళ నుంచి వస్తాయ్.

కరోనా ఎంతలా ఇబ్బంది పెట్టి వుండకపోతే, పూజా హెగ్దే ఇలా ఆర్జీవీలా తయారైపోతుంది.? అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఎలాగైతేనేం, పూజా హెగ్దే కరోనా నుంచి కోలుకుంది.. సో, అభిమానులూ హ్యాపీ. ప్రస్తుతం ఆమె చేతిలో చాలా సినిమాలున్నాయి. వాటిల్లో తెలుగుతోపాటు, తమిళ, హిందీ సినిమాలూ వున్నాయ్.

Maharshi Song Maheshbabu Pooja Hegde

ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సినిమాలోనూ, మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్య సినిమాలో చరణ్ సరసన, అక్కనేని అఖిల్ హీరోగా తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తదితర తెలుగు సినిమాల్లో నటిస్తోంది పూజా హెగ్దే.

You may also like

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group