Sherlyn Chopra.. ఒకటి కాదు, రెండు కాదు.. పదీ కాదు, పాతికా కాదు.. ఏకంగా 75 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తోంది నటి షెర్లీన్ చోప్రా. అవతలి పార్టీ ఎవరో తెలుసా.? బాలీవుడ్ నటి శిల్పా వెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా.
ఇటీవల అసభ్యకరమైన వీడియోల కేసులో అడ్డంగా బుక్కయిపోయి, జైలుకి వెళ్ళొచ్చిన రాజ్ కుంద్రా చేతిలో షెర్లీన్ చోప్రా మోసపోయిందట. బెదిరింపులకు గురయ్యిందట. ఈ విషయాలపై ఇప్పటికే పోలీసుల్ని ఆశ్రయించిన షెర్లీన్ చోప్రా, తాను ఎట్టి పరిస్థితుల్లోనూ శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలను వదిలే ప్రసక్తే లేదంటోంది.

Sherlyn Chopra ఎందుకిలా.?
కొన్నాళ్ళ క్రితం షెర్లీన్ చోప్రాకి ఓ ఆఫర్ ఇచ్చాడట రాజ్ కుంద్రా. అదీ అసభ్యకరమైన వీడియో కోసమేనా.? అన్నది తేలాల్సి వుంది. ఈ వీడియోలతో పెద్ద వ్యాపారమే చేస్తున్నాడు రాజ్ కుంద్రా. అడ్డంగా బుక్కయిపోయి జైలుకు వెళ్ళింది కూడా ఆ అభ్యంతకర నగ్న వీడియోల విషయంలోనే.
ఎక్కడ తేడా కొట్టిందోగానీ, షెర్లీన్ చోప్రాని బెదిరించడం షురూ చేశాడట రాజ్ కుంద్రా. ఎలాగోలా అతన్నుంచి తప్పించుకున్నానని షెర్లీన్ చోప్రా చెప్పింది. ఎప్పుడైతే రాజ్ కుంద్రా అరెస్టయ్యాడో, అతనికి సంబంధించి తనకు తెలిసిన కొన్ని విషయాల్ని పోలీసులకు వెల్లడించింది.
Also Read: ఆన్‌లైన్ బూతు బాగోతం.. ఈ రోగానికి వ్యాక్సిన్ ఏదీ.?
రాజ్ కుంద్రా ఏం చేశాడంటే..
తమ కుటుంబానికి పరువు నష్టం కలిగించిందని ఆరోపిస్తూ షెర్లీన్ చోప్రా మీద 50 కోట్లకు ‘దావా’ వేశారు శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా. ఈ వ్యవహారంపై మళ్ళీ కొత్త దుమారం షురూ అయ్యింది. దానికి కౌంటర్‌గా షెర్లీన్ కూడా 75 కోట్లకు నోటీసులు పంపిందట. అదీ అసలు కథ.
ఇప్పట్లో ఈ బూతు వీడియోల ఎపిసోడ్ చల్లారేలా లేదు. షెర్లీన్ చోప్రా (Sherlyn Chopra) కూడా బూతు వీడియోలు చేసి, ఇంటర్నెట్‌లో అమ్మకానికి పెట్టి, బాగానే సొమ్ము చేసుకున్న సంగతి తెలిసిందే.