KGF Chapter 2 Telugu Review.. కన్నడ సూపర్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిన ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
కన్నడ సినిమాగా ప్రారంభమై, పాన్ ఇండియా సినిమాగా ‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’ సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘కేజీఎఫ్’ సిరీస్‌లో ‘ఛాప్టర్ 2’ థియేటర్లలో సందడి చేస్తోంది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో హీరో, విలన్ పాత్రల గురించే దేశమంతా చర్చ జరుగుతోంది.
‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’లో మెయిన్ విలన్ అధీరా పాత్రలో సంజయ్ దత్ నటించడం.. ఈ సినిమాకి మరింత క్రేజ్ పెంచింది. ఇంతకీ, ఈ రోజు థియేటర్లలోకి వచ్చిన ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ ఎలా వుంది.?
KGF Chapter 2 Telugu Review.. ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ ఎలా వుంది.?
కథ, కాకరకాయ్ సంగతి పక్కన పెడితే, సినిమాలో కథానాయకుడికి దర్శకుడు ఇచ్చిన ఎలివేషన్స్ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. అన్నట్టుగానే వున్నాయన్నది మెజార్టీ అభిప్రాయం.
సినిమాటోగ్రఫీ, సంగీతం ఈ ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ సినిమాకి ప్రాణం. మాస్ మెచ్చే యాక్షన్ సీన్స్‌కి సినిమాలో కొదవే లేదు. అయితే, హీరోయిజాన్ని ఎలివేట్ చేసే క్రమంలో లాజిక్స్ చాలావరకు మిస్సయ్యాడు దర్శకుడు.
ఇక, కథానాయకుడు యశ్ హీరోయిజంని ఎవరూ ఊహించని స్థాయిలోకి తీసుకెళ్ళిపోయాడు దర్శకుడు.
విలన్ పాత్రకి ఇచ్చిన బిల్డప్ కూడా మామూలుగా లేదు. సాధారణంగా సీక్వెల్ సినిమాలు అంచనాల్ని అందుకోవడం కష్టమే. కానీ, ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ అలా కాదు.. అంచనాల్ని మించి వుంది.
సినిమా చూసినోళ్ళంతా కథ గురించి ఆలోచించాల్సిన పనే లేదంటున్నారు. కథ, స్క్రీన్ ప్లే ఏమంత గొప్పగా లేవన్నది మెజార్టీ సినీ విశ్లేషకుల అభిప్రాయం.
అయినాగానీ, ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ (KGF Chapter 2) అంచనాల్ని అందుకుంది.. కాదు కాదు దాటేసిందని సినీ విశ్లేషకులే చెబుతున్నారు.
Also Read: విజయ్ ‘బీస్ట్’ కదా.! కానీ, భయపడ్డాడెందుకు.?
ఇంతకీ, ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ వసూళ్ళు ఎలా వుండబోతున్నాయ్.? తొలి రోజు అయితే సంచలన వసూళ్ళు సాధించనుంది ఈ సినిమా. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాల్లేవ్.
లాంగ్ వీకెండ్ ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ సినిమాకి పెద్ద అడ్వాంటేజ్.! ‘ఆర్ఆర్ఆర్’ మేనియా ఇంకా చల్లారకముందే, ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ రూపంలో ఇంకో సౌత్ సినిమా దేశమంతా ఓ ఊపు ఊపేయనుందన్నమాట.