Table of Contents
Andhra Pradesh Political Arrest.. ఆయన పేరు నారాయణ.! అదేనండీ నారాయణ విద్యా సంస్థల అధినేత. చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ మంత్రిగా కూడా పని చేశారాయన. విద్యావేత్త అనాలా.? విద్యా వ్యాపార వేత్త అనాలా.?
నారాయణ విద్యా సంస్థల్లో మీ పిల్లలెవరైనా విద్యను అభ్యసిస్తుంటే, ఆ నారాయణ గురించి కొత్తగా మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన్ని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు.
దానికి కారణం రెండు వ్యవహారాలు. అందులో ఒకటి పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకు కాగా, రెండోది అమరావతి కుంభకోణం.
Ex Minister Narayana Arrest.. అరెస్టులు.. అదో ప్రసహనం.!
కొన్నాళ్ల క్రితం వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామ కృష్ణం రాజును రాజద్రోహం కేసులో అరెస్టు చేసి, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు.
మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా అరెస్టయ్యారు. దేవినేని ఉమా మహేశ్వరరావు సహా చాలా మంది మాజీ మంత్రులు, టీడీపీ నేతలు గడిచిన మూడేళ్లలో అరెస్టవుతుండడం చూస్తున్నాం.
ఛత్.! ఇవన్నీ అక్రమ అరెస్టులనీ టీడీపీ ఆరోపిస్తోంది. అరెస్టులన్నీ సక్రమమేనని వైసీపీ చెబుతోంది. కొన్ని కేసుల్లో పోలీసులకు న్యాయ స్థానాలు అక్షింతలేయడం చూశాం.
Andhra Pradesh Political Arrest.. రాజకీయ అరెస్టులపై నిలదీయాల్సింది ఎవరు.?
అసలు రాజకీయ నాయకుల అరెస్టులు అంటేనే, జనాలకు అసహ్యం వేస్తోంది.
అక్రమాస్థుల కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టయ్యి, 16 నెలలు జైల్లో వున్నారు. ఆ కేసు ఏమైంది.? న్యాయ స్థానంలో నడుస్తూ, నడుస్తూ, నడుస్తూ వుంది. నడుస్తూనే వుంటుంది.
రాజకీయ నాయకుల మీద కేసులంటేనే అంత. వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత విషయం తీసుకుంటే, రాజకీయాల్లో, రాజకీయ నాయకుల మీద కేసులు ఎలా వుంటాయ్.? అవి సభ్య సమాజానికి ఎలాంటి సంకేతాలు పంపుతాయ్..? అనేది అర్ధమవుతుంది.
ప్రజలకే భయం.. నాయకులకు అరెస్టులంటే ఇష్టం.!
రాజకీయ నాయకులకి కేసులంటే భయం లేదు. అరెస్టులంటే అస్సలే భయం లేదు. కానీ, సామాన్యులకి అరెస్టులన్నా, కేసులన్నా చచ్చేంత భయం.
ఓ వ్యక్తి మీద పోలీస్ కేసు వుంటే, ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హుడు. కానీ, ఓ రాజకీయ నాయకుడి మీద ఎన్ని ఎక్కువ కేసులుంటే, ప్రభుత్వాన్ని నడిపేందుకు అంత ఎక్కువ అర్హత వున్నట్లు. ఇదీ నేటి రాజకీయం.
Also Read: పవన్ కళ్యాణ్ వేళ్ళకున్న ఉంగరాల్లో ఏ రహస్యం దాగుందంటే.!
రాజకీయ నాయకులు మారరు కాక మారరు. వారిని మార్చే శక్తి ప్రజలకే వుంది. రాజకీయ నాయకుల్ని ప్రజలు నిలదీయాలి.
‘నీ మీద కేసులుంటే, నీకు పదవులొస్తున్నాయ్. నా మీద కేసులుంటే నాకెందుకు ఉద్యోగం రాదు..’ అని యువత నిలదీసినప్పుడు రాజకీయాల్లో మార్పు తప్పక వస్తుంది.