Pawan Kalyan For Nani.. సినిమానీ, రాజకీయాన్నీ కలగలిపేస్తున్నారు కొందరు. రాజకీయమంటేనే అంత.!
అధికారం చేతిలో వుంటే, ఏదైనా చేయొచ్చనే భ్రమల్లో కొందరుంటారు. ఈ క్రమంలోనే అధికారాన్ని అడ్డంపెట్టుకుని, అడ్డగోలు రాజకీయాలూ చేస్తుంటారు.!
‘భీమ్లానాయక్’ సినిమా కోసం థియేటర్ల వద్ద అధికారుల్ని మోహరించాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది.? ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా సమయంలో థియేటర్లపై సోదాల పేరుతో రాజకీయమెందుకు నడిచింది.? ఇదంతా బహిరంగ రహస్యం.
సినిమాలో కంటెంట్ వుంటే, దాని చుట్టూ ఎంత కుట్ర జరిగినా.. దాన్ని ప్రేక్షకులే తిప్పికొడతారు. ఆ విషయంలో ‘శ్యామ్ సింగరాయ్’, ‘భీమ్లానాయక్’ సినిమాల విషయంలో నిరూపితమయ్యింది.
Pawan Kalyan For Nani.. శ్యామ్ సింగరాయ్.. భీమ్లానాయక్.. ఒకే వేదికపై.!
పవన్ కళ్యాణ్, నాని.. ముక్కు సూటిగా మాట్లాడారు.. అందుకే, వాళ్ళ సినిమాలకు అడ్డంకులు ఎదరయ్యాయి. ఈ ఇద్దరూ ఇప్పుడు ఒకే వేదికపై కనిపించబోతున్నారు.

ఈసారి ఏమవుతుంది.? ఇంకేమవుతుంది.? షరామామూలుగానే ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే వుంటారు.
నాని హీరోగా తెరకెక్కిన ‘అంటే సుందరానికి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ నెల 9న ఈ ఈవెంట్ హైద్రాబాద్‌లో జరగబోతోంది. ఇంకేముంది.? రాజకీయం షురూ అయ్యింది.!
ఎలాగైనా, ‘అంటే సుందరానికీ..’ సినిమాకి ఆటంకాలు కలిపించేందుకు ఆ రాజకీయం ఇప్పటినుంచే దారులు వెతుక్కుంటోంది.
Also Read: అనసూయ ఆన్‌లైన్ ‘ఆట’: ఆడండి, నాశనమైపోండి.!
మళ్ళీ సినిమా టిక్కెట్ల ధరల్ని తగ్గించేస్తారా.? థియేటర్ల దగ్గర అధికారుల్ని కాపలా పెడతారా.? సినిమాకి మంత్రులు రివ్యూలు చెప్పబోతున్నారా.?
అయినా, ‘మనల్ని ఎవడ్రా ఆపేది..’ అనుకునే టైపు అటు పవన్ కళ్యాణ్ అయినా, ఇటు నాని అయినా.! సో, డోన్ట్ కేర్ అంతే.!