Acharya Mega Star Chiranjeevi.. మెగాస్టార్ చిరంజీవి సినిమాకి హైప్ లేదని ఒకడు ‘కూస్తాడు’.! ఇంకొకడు, సినిమాని కొన్న బయ్యర్లు హ్యాపీగా లేరని మొరుగుతాడు.!
మరొకడు, హీరోయిన్ వయసు తనకంటే చాలా తక్కువ కావడంతో, మెగాస్టార్ చిరంజీవి.. ఆ క్యారెక్టర్‌నే లేపేయించారని వెకిలి చేష్టలు చేస్తాడు.!
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పోటీ పడగలదా.? ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ సినిమాని మించగలదా.. ఇలా ‘ఆచార్య’ గురించి అడ్డగోలు పోలికలు తెస్తున్నారు ఇంకొందరు.!
బాక్సాఫీస్ Acharya Mega Star Chiranjeevi
తెలుగు సినిమాకి కలెక్షన్ల వెలుగులు తీసుకొచ్చిందే మెగాస్టార్ చిరంజీవి. ‘ఇండియాలో నిఖార్సయిన సూపర్ స్టార్ అయినా మెగాస్టార్ అయినా ఒకే ఒక్కడు.. ఆయనే మెగాస్టార్ చిరంజీవి..’ అని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నినదించారంటే.. దటీజ్ మెగాస్టార్ చిరంజీవి.

మెగాస్టార్ చిరంజీవి చూడని విజయమా.? అదెక్కడ.!
కలెక్షన్ల లెక్కల గురించి ఇప్పుడు కొత్తగా మాట్లాడుకుంటున్నారేమో.. అసలు కలెక్షన్ల గురించి మాట్లాడుకోవడం మొదలైందే మెగాస్టార్ చిరంజీవి నుంచి.. అన్న విషయం ఎంతమందికి తెలుసు.?
‘ఖైదీ నెంబర్ 150’ సినిమా విడుదలకు ముందు హేటర్స్ ఎంతలా ఏడ్చినా, ఆ సినిమాతో 100 కోట్ల క్లబ్బులోకి చేరి, తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని మెగాస్టార్ చిరంజీవి నిరూపించారు.
వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్.!
తన కెరీర్‌లో ‘మగధీర’ లాంటి సినిమా చేయలేదన్న కసితో ‘సైరా నరసింహారెడ్డి’ చేశారు. ఇప్పుడు ‘ఆచార్య’ అంటూ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’పై అంతలా కక్ష పెంచుకున్నారెందుకు.?
సినిమా రంగం పట్ల తనకున్న మమకారాన్ని చాటుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) సినిమాలు చేస్తున్నారు తప్ప.. ఎవరితోనో ఎవరో పోలిక పెడతారని కాదు.!
చిరంజీవితో సినిమా చేయడమే తమ జీవిత లక్ష్యంగా చెప్పుకునే చాలామంది యంగ్ డైరెక్టర్స్ ‘కలల్ని’ నిజం చేస్తున్నారు ఈ ఆచార్యుడు. యస్, హీ ఈజ్ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి.