Table of Contents
Actor Siddharth Telangana Drugs.. నటుడు సిద్దార్ధ, ‘భారతీయుడు-2’ సినిమా ప్రమోషన్ల కోసం మీడియా ముందుకొచ్చాడు.
సినిమా సంగతుల గురించి అడిగే క్రమంలో, ఇతర విషయాలూ ప్రస్తావనకు వస్తాయ్ మీడియా నుంచి.!
జర్నలిజం కాస్తా ఎర్నలిజంగా మారిపోయాక, మీడియా నుంచి వచ్చే ప్రశ్నలు ఎలా వుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
వీళ్ళు చెత్త ప్రశ్నలు అడుగుతోంటే, అంతకన్నా చెత్త సమాధానాలు సెలబ్రిటీల నుంచి వస్తున్నాయ్. ఇదో ప్రసహనంలా తయారైంది ఇటీవలి కాలంలో.
Actor Siddharth Telangana Drugs.. నోటి దూలకి మందు లేదు..
సిద్దార్ధ కూడా పత్తిత్తు సమాధానాలు చెబుతుంటాడు నోటి దురుసుతనం ప్రదర్శిస్తూ. కుక్క కాటుకి చెప్పు దెబ్బ అనాలో, ఇంకేమన్నా అనాలో అర్థం కాని పరిస్థితి.
నటులు, సామాజిక బాధ్యత.. అన్న అంశం గురించి ప్రస్తావనకు వస్తే, ‘నేనెప్పుడో కం..డోమ్ గురించి ప్రచారం చేశా.. సేఫ్ సె..క్స్ గురించి ప్రచారం చేశా.. నా సామాజిక బాద్యత అలా చూపించా’ అని చెప్పాడు సిద్దార్ధ.
అక్కడితో ఆగితే అతను సిద్దార్ధ ఎలా అవుతాడు.? ఎవరూ మమ్మల్ని సామాజిక బాధ్యత విషయమై ఒత్తిడి చేయలేరు.. అనేశాడాయన.
ఒత్తిడి బాగా పనిచేసినట్టుంది..
డ్రగ్స్ విషయమై అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలంటూ ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ప్రస్తావన వచ్చినప్పుడు సిద్దార్ద పై విధంగా స్పందించాడు.

ప్రభుత్వం తరఫున సూచన చేశారు రేవంత్ రెడ్డి.! అంతే కాదు, సినీ పరిశ్రమలో ప్రభుత్వం తరఫున వెసులుబాట్లు కోరుకునేవారు, డ్రగ్స్ విషయమై అవగాహన కల్పిస్తూ ఓ నిమిషం, రెండు నిమిషాల వీడియో చేసి ఇవ్వాలని కోరారు.
దాన్ని తప్పనిసరి చేస్తూ అధికారుల్ని ఆదేశించారు కూడా. అంతకన్నా ముందే, మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో చేశారు డ్రగ్స్ విషయమై అవగాహన కల్పిస్తూ. దాన్ని ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి, సూచన చేశారు.
ఇంగితం వుండాలి కదా..
విషయం ఎంత ముఖ్యమైనది.? అన్న ఇంగితం లేకుండా, సిద్దార్ధ అలా ఎలా మాట్లాడాడు.? అతనంతే, అదో టైపు.!
వివాదం ముదిరి పాకాన పడేసరికి, ట్రోలింగ్ తట్టుకోలేక ‘నా వ్యాఖ్యల్ని అపార్ధం చేసుకున్నారు..’ అంటూ వీడియో విడుదల చేసి, తెలంగాణ ప్రభుత్వానికి తన సంపూర్ణ మద్దతు పలికాడు.
Also Read: ‘ఓజీ’ వచ్చేస్తోంది.! డిప్యూటీ సీఎం కళ్యాణ్‌కి కల్ట్ చూపించాలె.!
డ్రగ్స్ విషయమై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కోసం తనవంతు కృషి చేస్తాననీ సిద్దార్ధ చెబుతూ ఇంకో వీడియో విడుదల చేశాడు.
ముందు నోటి దురద ప్రదర్శించకుండా వుండి వుంటే, ఇలా వివరణ వీడియో విడుదల చేయాల్సి వచ్చేది కదా.?