అఖిల్ సార్థక్, సయ్యద్ సోహెల్.. (Akhil Sarthak Syed Sohel Drama) బిగ్‌హౌస్‌లో మంచి స్నేహితులైపోయారు. ఈ ఇద్దరితోపాటు మెహబూబ్ దిల్ సే కూడా ఈ గ్యాంగు సభ్యుడే. అన్నట్టు, అలేఖ్య హారికకి కూడా ఈ గ్యాంగ్ మెంబర్‌షిప్ వున్నట్లే కనిపిస్తోంది. ‘డీల్’ టాస్క్ సందర్భంగా అఖిల్‌కి చాలా ఈజీ టాస్క్ వచ్చింది.
కదలకుండా చెయిర్‌లో కూర్చోవడం.. అతన్ని ఇబ్బంది పెట్టి చెయిర్‌లోంచి లేపేందుకు ప్రత్యర్థులు ప్రయత్నించడం.. ఇదీ టాస్క్. మామూలుగా అయితే, ఇది అసలు టాస్కే కాదు. కానీ, అక్కడికేదో తాను పెద్ద యుద్ధం చేసేసినట్లు అఖిల్ సార్ధక్ ఓవరాక్షన్ చేసేశాడు.
సంచాలకుడిగా వుండాల్సిన సోహెల్ కాస్తా, కన్నింగ్ ‘గేమ్’ ఆడేశాడు. తాను సంచాలకుడినని మర్చిపోయి మరీ, ‘బ్లూ టీమ్’కి సపోర్ట్ చేశాడు సోహెల్. అది కాస్తా ‘రెడ్ టీమ్’లోని అవినాష్‌కి ఒళ్ళు మండేలా చేసింది. సోహెల్ మీద అవినాష్ ‘కీ పాయింట్స్’ లేవనెత్తేసరికి, సమాధానం చెప్పలేక.. ‘ఏడుపు నాటకానికి’ తెరలేపేశాడు.
ఆ ఏడుపు నాటకాన్ని అఖిల్ సార్ధక్ ఇంకా బాగా రక్తికట్టించాడు. సోహెల్‌ని ఓదార్చుతున్నట్లు అఖిల్ నటిస్తే.. అక్కడికేదో కొంపలు మునిగిపోయినట్లు, సోహెల్.. తన కోపాన్నంతా చూపించి.. ఏదో వస్తువుని లాగి కొట్టేశాడు. ఈ క్రమంలో సోహెల్ చేతికి దెబ్బ తగిలినట్లు ఇంకో ఓవరాక్షన్ మొదలైంది.
ఈసారి హారిక కూడా ఓవరాక్షన్ సీన్‌లోకి వచ్చింది. నిజానికి, అఖిల్ మొహమ్మీద నీళ్ళు వేస్తున్నప్పుడు, షాంపూతో తల రుద్దుతున్నప్పుడు.. రెడ్ టీవ్‌ు తరఫున అవినాష్, అబిజీత్ మాత్రమే కాదు.. మెహబూబ్ కూడా ‘ఇది జస్ట్ ఆట మాత్రమే.. మేం కూడా మనుషులమే.. మేం మరీ అంత దారుణంగా బిహేవ్ చెయ్యలేం..’ అంటూ అఖిల్‌ని జాగ్రత్తగానే చూసుకున్నారు.
సోహెల్ ఓవరాక్షన్‌తో, అఖిల్ రెచ్చిపోయాడు. మోనాల్ దగ్గర అఖిల్, రెడ్ టీమ్ గురించి (మోనాల్ కూడా రెడ్ టీమ్ సభ్యురాలే కావడం గమనార్హం. ఆమె కూడా అఖిల్ కోసం అబిజీత్‌తో చిన్నపాటి సమస్య తెచ్చుకునేందుకు ప్రయత్నించింది) రాంగ్ కామెంట్స్ చేశాడు. ఆడటం చేతకాదంటూ విరుచుకుపడిపోయాడు అఖిల్ సార్థక్ (Akhil Sarthak Syed Sohel Drama).
అంతిమంగా ఇది, కెప్టెన్సీ కోసం పోటీ పడే టాస్క్. టాస్క్ ఎందుకో, ఏంటో తెలిసి కూడా ఇంత ఓవరాక్షన్ చేయడం హాస్యాస్పదం. గెలిచిన టీవ్‌ు నుంచి కెప్టెన్ ఎంపికవుతారు. అఖిల్‌తో పోల్చితే, లాస్య అన్ని రకాలూ మిక్స్ చేసిన ఓ జ్యూస్ లాంటిది తాగడమే కొంచెం కష్టమైన పనేమో. ఏమో ఏంటి.? అదే కష్టం. కానీ, లాస్య అంత ఓవరాక్షన్ చెయ్యలేదు కదా.!