Allu Arjun Lokesh Kanagaraj Gossips… ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టైలిష్ మాస్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ సినిమాకి అనిరుధ్ సంగీత దర్శకత్వం వహించనున్నాడు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది.
నిజానికి, ఇక్కడ మనం ప్రస్తావించుకున్నదంతా పాత కథే.! కానీ, కొత్తగా ఓ కట్టుకథ ప్రచారంలోకి వచ్చింది. ఈ ప్రాజెక్ట్, సెట్స్ మీదకు వెళ్ళకుండానే ఆగిపోయిందని.
అబ్బే, ఆగిపోలేదు.. కాకపోతే, కథ నచ్చలేదు.. కొత్త కథ తయారు చేసుకురమ్మని లోకేష్ కనగరాజ్‌కి అల్లు అర్జున్ తేల్చి చెప్పాడంటూ ఇంకో పుకారు పుట్టుకొచ్చింది.
Allu Arjun Lokesh Kanagaraj Gossips.. పుకార్ల మీద పుకార్లు..
ఇవేవీ కాదు, ఫస్టాఫ్ ఓకే అయిపోయింది, సెకెండాఫ్ విషయమై అల్లు అర్జున్ కొన్ని సూచనలు చేయడంతో, ప్రాజెక్ట్ తాత్కాలికంగా ఆగింది.. ఈలోగా అల్లు అర్జున్ వేరే ప్రాజెక్ట్ చేస్తాడన్నది మరో పుకారు.!
ఇలా పుకార్ల మీద పుకార్లు పుట్టుకొస్తున్న దరిమిలా, దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్పష్టతనిచ్చాడు. అదీ, ఒకే ఒక్క ఫొటోతో. అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్.. ఇద్దరూ సీరియస్ డిస్కషన్లో వున్న ఫొటో అది.
త్వరలోనే ఇంట్రెస్టింగ్ అప్డేట్ రాబోతోందంటూ, ఆ ఫొటోతోపాటు కామెంట్ చేశాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. మైత్రీ మూవీ మేకర్స్, అనిరుధ్‌లను ట్యాగ్ చేశాడు దర్శకుడు.
సో, ఇక్కడితో అన్ని అనుమానాలకూ ఫుల్స్టాప్ పడినట్లేనా.? ప్చ్, పుకార్లు ఎలాగైనా పుట్టుకొచ్చేస్తాయ్. కంటెంట్ కావాలి మరి, గాసిప్పుల మీద బతికేవాళ్ళకి.!
తెలుసు కదా, అత్యంత భారీ బడ్జెట్‌తో లోకేష్ కనగరాజ్ – అల్లు అర్జున్ కాంబినేష్న్లో సినిమా తెరకెక్కబోతోందని.
అట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్లో ప్రస్తుతం ‘రాకా’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.