Home » ఐశ్వర్య లక్ష్మి ఆవేదన: తప్పుడు కళ్ళు.! అలా చూపిస్తే ఎలా.?

ఐశ్వర్య లక్ష్మి ఆవేదన: తప్పుడు కళ్ళు.! అలా చూపిస్తే ఎలా.?

by Mudra369 Editorial Desk
0 comments
Aishwarya Lekshmi

Aishwarya Lekshmi Social Vulgarity.. మొన్నామధ్యన నటి రుక్మిణి వసంత్, సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది.. తనను అసభ్యకరంగా కొందరు ‘చిత్రీకరిస్తున్నారు’ అని.!

అంతకు ముందు, తెలుగునాట ఓ హీరోయిన్ ఇలానే మండిపడింది.! ఈ మధ్య చాలామంది హీరోయిన్లు ఎదుర్కొంటున్న సమస్యే ఇది.!

ఒకప్పుడు, సినిమా తారల్ని అందంగా చూపించడానికి కెమెరాలు పోటీ పడేవి. సినిమాల్లోనే కాదు, సినిమా ఫంక్షన్లలోనూ హీరోయిన్లు గ్లామరస్‌గా కనిపిస్తే, కెమెరాలు ‘క్లిక్’మనిపించేస్తాయి.

అయితే, సోషల్ మీడియా పుణ్యమా అని.. కెమెరా కళ్లు ‘తప్పుడు ఆలోచనలు’ చేస్తున్నాయి.! అసభ్యకరంగా హీరోయిన్లను చూపించేందుకు కెమెరా కళ్ళు పోటీ పడుతున్నాయి.

Aishwarya Lekshmi Social Vulgarity.. తప్పుడు కళ్ళ చొరబాటు..

కెమెరా.. అంటే, ఇప్పుడు సంప్రదాయ డిజిటల్ కెమెరాలు మాత్రమే కాదు.. మొబైల్ ఫోన్లు కూడా.! ఔను, హై క్వాలిటీ ఇమేజెస్‌ని చిత్రీకరించగల స్మార్ట్ ఫోన్లు ఇప్పుడు అందరి చేతుల్లోనూ వున్నాయ్.

దాంతో, సినీ జర్నలిస్టుల ముసుగేసుకుని.. ఇతరులూ సినిమా సంబంధిత ఈవెంట్లలోకి చొరబడుతున్నారు. షోరూమ్స్ ఓపెనింగ్ వంటి కార్యక్రమాల్లో రచ్చ.. అది వేరే వ్యవహారం.

Aishwarya Lekshmi
Aishwarya Lekshmi

నటీమణుల ప్రైవేట్ పార్ట్స్‌ని వల్గర్‌గా చూపించేందుకు ‘జూమ్’ చేసి మరీ, చిత్రీకరిస్తున్నారు కొందరు. ఆ ఫొటోలు, వీడియోలకు సోషల్ మీడియాలో బీభత్సమైన రీచ్ వస్తోంది.

ఇలాంటి వీడియోలతో వేలల్లో, లక్షల్లో సొమ్ములు చేసుకుంటున్నాయి యూట్యూబ్ ఛానల్స్. సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా సంపాదనా మార్గాలుగా మారిపోయాయి.. దాంతో, ‘కెమెరా కళ్ళు’ చెలరేగిపోతున్నాయంతే.

తాజాగా, నటి ఐశ్వర్య లక్ష్మి తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. తాను సాధారణ దుస్తుల్నే ధరించాననీ, కానీ అసభ్యకరంగా తనను చిత్రీకరించారని వాపోయింది.

నిజమే, హీరోయిన్లు వంగినప్పుడు.. నడుస్తున్నప్పుడూ.. రకరకాల యాంగిల్స్‌లో కెమెరాలు పెట్టి, హీరోయిన్లను అసభ్యకరంగా చూపిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మికి కూడా ఇదే అనుభవం ఎదురయ్యింది.

హీరోయిన్లు ఎంతలా ఆవేదన వ్యక్తం చేస్తున్నా..

బాహాటంగా హీరోయిన్లు తాము పడుతున్న ఇబ్బంది గురించి వాపోతున్నా, ఈ పైత్యం అయితే తగ్గడంలేదు.!

తప్పుడు కళ్ళను కంట్రోల్ చేసేందుకు, సినీ పరిశ్రమ తరఫున, సినిమా మీడియా తరఫున ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నా, అవి సత్ఫలితాలను ఇవ్వడంలేదు.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో తయారవుతున్న ఫొటోలు, వీడియోలు.. అవి చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా.!

సినిమాల్లో హీరోయిన్ల గ్లామర్ తప్పు కాదా.? అంటే, అదొక టీమ్ వర్క్. అదొక క్రియేటివ్ ఫీల్డ్. సదరు నటీమణి అంగీకారంతో, ఫొటో షూట్లు జరుగుతాయ్. సినిమాలు తెరకెక్కుతాయ్.

ఈ సోషల్ వల్గారిటీ వ్యవహారం వేరు. హీరోయిన్లకు తెలియకుండానే, వాళ్ళు వల్గర్‌‌గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group