Aman Preet Singh Rakul.. సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ తెలుసా.? ఆ మద్యన ఏదో తెలుగు సినిమాలో నటించినట్టు గుర్తు.!
అది కూడా, అక్క రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ‘సాయం’తో.! అన్నట్టు, ఆ సినిమాకి ‘నిన్నే పెళ్ళాడతా’ అనే టైటిల్ కూడా అప్పట్లో పెట్టారు.
అమన్ ప్రీత్ సింగ్ నటించిన ఆ ‘నిన్నే పెళ్ళాడతా’ సినిమా విడుదలయ్యిందా.? లేదా.? అన్నది వేరే చర్చ.
Aman Preet Singh Rakul.. నిన్నే పెళ్ళాడతా.. సినిమా వచ్చిందా.?
అక్కినేని నాగార్జున నటించిన సూపర్ హిట్ సినిమా ‘నిన్నే పెళ్ళాడతా’.. ఆ సినిమా టైటిల్‌ని రకుల్ కోసం, అక్కినేని నాగార్జున ‘దానం’ చేశాడని అప్పట్లో సినీ జనం చెవులు కొరుక్కున్నారు.
ఇప్పుడు అసలు విషయమేంటంటే, అమన్ ప్రీత్ సింగ్ (Aman Preet Singh) హైద్రాబాద్‌లో అరెస్టయ్యాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

ఎందుకు అరెస్ట్ చేశారబ్బా.? డ్రగ్స్ కేసులో అరెస్టు చేశారు.! అరరె, అతనికి డ్రగ్స్‌తో లింకేంటి.? అదైతే, పోలీసులే వెల్లడించాల్సి వుంది.!
దొరికాడు సరే.. కానీ, అసలు విషయమేంటి.?
డ్రగ్స్ వినియోగించిన కారణంగానే అమన్ ప్రీత్ సింగ్‌ని పోలీసులు అరెస్టు చేశారన్నది ఓ ప్రచారం.
కాదు కాదు, నలుగురైదుగురు నైజీరియన్లతో కలిసి అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ పెడ్లింగ్ చేస్తున్నాడన్నది ఇంకో వాదన.
ఏది నిజమన్నది పోలీసులు ఆ కేసు వివరాలు వెల్లడిస్తేనే తెలుస్తుంది. సినీ పరిశ్రమకీ, డ్రగ్స్‌కీ విడదీయరాని సంబంధం వుందా.? అంటే, కాదనలేని పరిస్థితి.
Also Read: Janhvi Kapoor Ulajh Confidential..జాన్వీ ‘ఉలజ్’ టాప్ సీక్రెట్.!
ఆ మధ్య రవితేజ సోదరులు డ్రగ్స్ కేసులో ఇరుక్కుపోయారు. ఆ మాటకొస్తే, పూరి జగన్నాథ్ సహా పలువురు తెలుగు సినీ ప్రముఖులు డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు.
మొన్నటికి మొన్న, సీనియర్ నటి హేమని (Tollywood Actress Hema) బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు.. డ్రగ్స్ కేసు, రేవ్ పార్టీ వ్యవహారంలో.