Ananya Sharma IAF Pilot.. నాన్నకు ప్రేమతో.. అంటూ చాలామంది తమ తండ్రి ఆశయాల్ని నెరవేరుస్తుంటారు. తండ్రి చూపిన బాటలో అత్యున్నత శిఖరాల్ని అధిరోహిస్తుంటారు.
ఆ కోవలోకే వస్తుందీ నాన్చ కూచి.! ఔను, ఆమె కదనరంగంలో అవబోతోంది ఘనాపాటి.! యుద్ధ విమానాల్ని నడపడం అంటే మన దేశంలో మహిళలకు చాలా చాలా అరుదైన విషయం.
భారత వైమానిక దళంలో పైలట్‌గా పనిచేస్తోన్న సంజయ్ శర్మ తన కుమార్తెను కూడా పైలట్‌గా మలచాలనుకున్నారు. ఆయన అనుకుంటే సరిపోతుందా.?
Ananya Sharma IAF Pilot.. నాన్నతో కలిసి..
సంజయ్ శర్మ కుమార్తె అనన్య శర్మ సైతం, తన తండ్రిలాగానే పైలట్ అవ్వాలనుకున్నారు. ఈ క్రమంలో ఆమె చాలా చాలా కష్టపడ్డారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో బీటెక్ పూర్తి చేసిన అనన్య, వైమానిక దళంలో చేరారు.
2016లో మొదటి మహిళా పైలట్ల బృందంలో చోటు దక్కించుకున్నారు అనన్య. అనంతరం ఫ్లయింగ్ బ్యాచ్ శిక్షణకు ఎంపికై, కఠిన శిక్షణ పూర్తి చేసుకుని, గత ఏడాది డిసెంబర్‌లో పైలట్‌గా నియామకం పొందారు.

ఇటీవల తన తండ్రితో కలిసి ఆమె ఒకే యుద్ధ విమానంలో పయనించారు. హాక్ 132 అనే యుద్ధ విమానాన్ని ఈ తండ్రీ కూతుళ్ళు నడిపారు. ఇది శిక్షణ విమానం మాత్రమే.
ఆమె చాలా చాలా ప్రత్యేకం.!
అయినాగానీ, తండ్రీ – కూతరు కలిసి ఒకే యుద్ధ విమానాన్ని నపడం, భారత వైమానిక దళంలో (Indian Air Force) ఇదే తొలిసారి.
ప్రస్తుతం అనన్య, బీదర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ నడపడంలో శిక్షణ పొందుతున్నారు.
Also Read: నువ్వు నాశనం చేసిన మట్టి.! నిన్ను ఇంకా బతికిస్తోంది.!
కోరికలు చాలామందికి వుంటాయి.. చాలామంది లక్ష్యాలు నిర్దేశించుకుంటారు.. ఎంతోమంది కలలు కంటారు. కానీ, కొందరు మాత్రమే కోరికల్ని నెరవేర్చుకుంటారు.. కలల్ని సాకారం చేసుకుంటారు.. లక్ష్యాల్ని చేరుకుంటారు.
అనన్య శర్మ.. నాన్న కూచి మాత్రమే కాదు.. తన తండ్రి తనను చూసి గర్వపడే స్థాయికి ఎదిగింది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.