Anasuya Bharadwaj Athi.. అసలేమయ్యింది అనసూయకి.! ఔను, ఆమెకు ఏమవుతుంది.? ఏమీ అవదు.! కానీ, ఏదో అయ్యిందని హంగామా చేస్తుంటుంది.
మొదలెట్టేదీ ఆమే.. ఆ తర్వాత గగ్గోలు పెట్టేదీ ఆమే.! అదే అనసూయ ప్రత్యేకత.! ‘నేను బోల్డ్.. నేను బ్యూటిఫుల్.. నేను డైనమిక్..’ ఇదీ అనసూయ తీరు.!
నిజమే.! అనసూయ (Anasuya Bharadwaj) బోల్డ్.! అనసూయ డైనమిక్.! అనసూయ బ్యూటిఫుల్.! కాకపోతే, ఈ స్థాయిలో ఎలా రాణిస్తుంది.? పేరు ప్రఖ్యాతులెలా సొంతం చేసుకుంటుంది.?
Anasuya Bharadwaj Athi.. స్టార్ హీరోలు రావాల్సిందే.!
స్టార్ హీరోల అభిమానులు కొందరు అనసూయ మీద దారుణమైన భాషలో తిడుతున్నారట.! సో, ఆయా హీరోలు వచ్చి, తమ అభిమానుల్ని కంట్రోల్లో పెట్టుకోవాలట.!
సోషల్ మీడియాలో సెటైర్లేస్తే, కౌంటర్ ఎటాక్ పడకుండా వుంటుందా.?
తమలపాకుతో నువ్వొకటిస్తే, తలుపు చెక్కతో నేనొకటిస్తా.. అన్న సామెత వుండనే వుంది.!
అన్నిటినీ భరించాలి సోషల్ మీడియా వేదికగా.! సెటైరేస్తా, దానికి ఎవరూ కౌంటర్ ఎటాక్ ఇవ్వకూడదంటే ఎలా.?
ఎవర్నో ఏదో అంటున్నావ్.. ఇందులో వేరే హీరోలకి సంబంధమేంటి.?
పబ్లిసిటీ స్టంట్స్‌కి అయినా ఓ హద్దూ అదుపూ వుండాలి కదా.?
జరిగే పనేనా ఇది.? మహేష్‌బాబు – ఎన్టీయార్ కలిసి ఓ వేదికపై కనిపించారు. అభిమానులంతా కలిసి వుండాలనీ, కొట్టుకోవద్దనీ విజ్ఞప్తి చేశారు.? కానీ, ఏం జరిగింది.?
యంగ్ టైగర్ ఎన్టీయార్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటించారు.. తామిద్దరం సొంత అన్నదమ్ముల్లాంటోళ్ళమన్నారు.

ప్చ్.. అభిమానులు వినలేదు.. పెంట పెంట చేశారు.. చేస్తూనే వున్నారు. ఎన్టీయార్, రామ్ చరణ్ కుటుంబ సభ్యుల్ని జుగుప్సాకరంగా తిడుతున్నారు.!
అసలు కథ వేరే వుంది.!
అందరూ అభిమానులు కాదు.! అందులో కొందరు దురభిమానులుంటారు. అదే అసలు సమస్య. నిజానికి, వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
Also Read: ఔను.! మోసం చేశాం.! ‘ఏజెంట్’ నిర్మాత ఒప్పుకోలు.!
ఇన్నేళ్ళ కెరీర్లో ఆమె ఏమీ అర్థం చేసుకోలేకపోయిందా.? అన్నీ తెలిసీ, తనను ట్రోల్ చేస్తున్న అభిమానుల తాలూకు హీరోలు స్పందించాలనడమేంటి.?
ఔను, అనసూయకి (Anasuya Bharadwaj) అదో సరదా.! సరదా కాకపోతే, గెలుక్కుని.. ఇలాంటి వింత వింత డిమాండ్లు చేయడమేంటి.?
బోల్డ్, బ్యూటిఫుల్ అండ్ డైనమిక్.! కాకపోతే ‘అతి’ ఎక్కువంతే.! అవును, ఆమెది సోషల్ పైత్యం మాత్రమే.. ఇది నెటిజనం వాదన.!