Home » సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే, కొత్తగా ఏం చూపిస్తారో.!

సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే, కొత్తగా ఏం చూపిస్తారో.!

by hellomudra
0 comments
Ashu Reddy

Ashu Reddy Glamorous Subscription.. కొత్తగా చూపించడానికేముంటుంది.? ఏం, ఎందుకు వుండదు.? ఏమైనా చూపించొచ్చు.! ఎలాగైనా చూపించొచ్చు.!

అందం చూడవయా.. ఆనందించవయా.! కాకపోతే, అలా ఆనందించడానికి కాస్త ఖర్చు చేయాలయ్యా.! ఇదీ, కొత్త ట్రెండ్. నిజానికి, కొత్త ట్రెండ్ ఏమీ కాదు, పాత ట్రెండే.!

కాకపోతే, పబ్లిసిటీ పీక్స్‌లో వుందిప్పుడు ఈ సబ్‌స్క్రిప్షన్ వ్యవహారానికి.! మొదట్లో ఓటీటీ ఎలా అలవాటు చేశారో చూశాం. ఇప్పుడది చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోతోంది.

ప్రకటనలు లేకుండా ఓటీటీలో సినిమా చూడాలంటే, చాలా ఖర్చు చేయాలి. అదో పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారిపోయిందిప్పుడు.!

Ashu Reddy Glamorous Subscription.. సబ్‌స్క్రిప్షన్స్.. ఇది యాపారం.!

సోషల్ మీడియా కూడా అంతే. నిన్న మొన్నటిదాకా అంతా ఉచితమే. ఇప్పుడిప్పుడే, సబ్‌స్క్రిప్షన్స్ వైపు వెళుతోంది యవ్వారం.!

ఔను, ఇది యాపారం.! ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కావాలంటే, సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ ఎంచుకోండి.. తగిన మొత్తం చెల్లంచండి.. అంటూ, సెలబ్రిటీలు సూచిస్తున్నారు.

Vishnupriya Subscription
Vishnupriya Subscription

బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియకి, ఈ విషయంలో లభించిన పబ్లిసిటీ అంతా ఇంతా కాదు. ఇదే కోవలో, ఇప్పుడు అనన్య నాగళ్ళ కూడా మొదలెట్టింది.

తాజాగా, ఈ లిస్టులోకి అషు రెడ్డి కూడా వచ్చి చేరింది. ఫక్కన నవ్వుతూ, నవ్వు ఆపుకుంటూ.. తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది అషు రెడ్డి, సబ్‌స్క్రిప్షన్ గురించి.

విష్ణు ప్రియకి భలే కలిసొచ్చింది..

వెయ్యికి కాస్త అటూ ఇటూగా వున్న సబ్‌స్కిప్షన్ల సంఖ్యని దాదాపు ఎనిమిది వేలకు పెంచేసుకుంది విష్ణుప్రియ అనూహ్యంగా. అనన్య నాగళ్ళకి కూడా బానే పెరగబోతున్నారు సబ్‌స్క్రైబర్లు. అషు రెడ్డికి కూడా అంతే.

ఇంతకీ, కొత్తగా ఈ సబ్‌స్క్రైబర్లకు సోకాల్డ్ అందాల భామలు చూపించేది ఏముంటుంది.? లైవ్ వీడియోలు, పర్సనల్ ముచ్చట్లు.. ఇలాంటివన్నీ వుంటాయట.

కొంతమంది ఇన్‌ఫ్లూయర్లు అయితే, లైవ్‌లో బూతులతో కుర్రకారుకి సెగలు పుట్టిస్తుంటారు. వస్త్ర సన్యాసం.. ఇందులో మరో స్పెషల్ ప్యాకేజ్.

ఇదో రకం దోపిడీ..

చాలాకాలంగా నడుస్తున్న దందా ఇది.! ఔను, ఇది యాపారం.! గ్లామరస్ యాపారం.! అసభ్యకరమైన కంటెంట్‌కి ఈ మధ్య భారత ప్రభుత్వం చెక్ పెట్టింది.

Also Read: నేరాలకు పాల్పడితే.! దేశం వెలుపల వున్నా తప్పించుకోలేరు.!

ముందు ముందు ఈ సబ్‌స్క్రిప్షన్స్ విషయంలో కూడా ఉక్కుపాదం మోపితే, ఈ సెలబ్రిటీలంతా ఏమైపోతారో ఏమో.!

ఒక్కటి మాత్రం నిజం.. సబ్‌స్క్రిప్షన్ కంటెంట్ అంటే, ఇదో రకమైన దోపిడీ.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group