Balakrishna Powereswara Pawan Kalyan .. ఈశ్వరా.! పవనేశ్వరా.! పవరేశ్వరా.! ఇది మాట కాదు, మంత్రం.! సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ జపించే మంత్రం.!
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌ని (Jana Senani Pawan Kalyan) ఉద్దేశించి ‘దేవర’ అని పిలుస్తుంటాడు బండ్ల గణేష్ (Bandla Ganesh).
ఈ క్రమంలోనే బండ్ల గణేష్.. ‘ఈశ్వరా.. పవనేశ్వరా..’ అంటుంటాడు.! అలా పవన్ కళ్యాణ్ అభిమానుల దృష్టిలో, పవన్ కళ్యాణ్ భక్తుడిగా బండ్ల గణేష్ తనదైన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.
Balakrishna Powereswara Pawan Kalyan.. బాలయ్య నోట.. పవరేశ్వర.!
సినిమాల పరంగా చూసుకున్నా, రాజకీయాల పరంగా చూసుకున్నా.. నందమూరి వర్సెస్ మెగా.. అనే ఫైట్ ఎప్పుడూ జరుగుతూనే వుంటుంది.
‘అలగాజనం’ అని తిట్టిన నోటితోనే, ‘పవరేశ్వరా’ అంటూ బాలయ్య ఏకంగా ‘పవన్ కళ్యాణ్ భజన’ చేయడమంటే, బాలయ్య కూడా పవన్ కళ్యాణ్‌ని ‘దేవర’ని చేసేసినట్టే.!
Mudra369
‘అలగాజనం’ అంటూ పవన్ కళ్యాణ్ (Jana Senani Pawan Kalyan) అభిమానుల్ని ఉద్దేశించి ఓ సందర్భంలో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించడం వివాదాస్పదమయ్యింది.
బాలయ్య (Nandamuri Bala Krishna) వ్యాఖ్యల పట్ల పవన్ కళ్యాణ్ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ‘బురద జాతి’ అంటూ పరోక్షంగా తమపై బాలయ్య చేసే విమర్శలకు మెగా కాంపౌండ్ ఒకింత గుస్సా అవుతుంటుంది.

‘బాలయ్య చిన్న పిల్లాడు.. పట్టించుకోవడం అనవసరం..’ అంటుంటారు మెగా కాంపౌండ్ హీరోలు.
అలాంటిది.. బాలయ్య నోట.. ఏకంగా ‘పవరేశ్వర’ అన్న ‘స్తోత్రం’ వినిపిస్తే.! కాస్త ఆలోచించాల్సిన విషయమే ఇది.
అందుకే బాలయ్యని చిన్న పిల్లాడనేది..
బాలకృష్ణ (Nandamuri Bala Krishna) వ్యాఖ్యల్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదు.! సినిమాల్లో డైలాగులెలా వల్లిస్తారో.. రియల్ లైఫ్‌లో కూడా అంతే.
Also Read: వీర సింహా రెడ్డి: బాలయ్య చెప్పిన ‘చుట్ట’ కథ.!
సినిమాటిక్ హంగామా తప్పితే, బాలయ్యకు నిజంగా అంత సీన్ అయితే లేదు. బాలయ్య అభిమానులే ఆయన్ని కాస్త ఎక్కువ ఊహించుకుంటుంటారన్న వాదన లేకపోలేదు.
ఏదిఏమైనా.. ‘అలగాజనం’ అని తిట్టిన నోటితోనే, ‘పవరేశ్వరా’ అంటూ బాలయ్య ఏకంగా ‘పవన్ కళ్యాణ్ భజన’ చేయడమంటే, బాలయ్య కూడా పవన్ కళ్యాణ్‌ని (Power Star Pawan Kalyan) ‘దేవర’ని చేసేసినట్టే.!