Bandla Ganesh Guruji Salaha.. నిర్మాత అవ్వాలంటే ఏం చెయ్యాలి.? అన్న ప్రశ్నకు నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఓ అద్భుతమైన సలహా ఇచ్చేశాడు.
‘గురూజీకి గిఫ్టు కొట్టు.. నిర్మతగా అవకాశం పట్టు..’ అన్నదే ఆ ఉచిత సలహా సారాంశం. ఇక్కడ గురూజీ ఎవరు.? అంటే, అది జగమెరిగిన సత్యం.
ఆ గురూజీ ఎవరో కాదు, త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas). బండ్ల గణేష్ ఎందుకిలా ‘గురూజీ’ త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద సెటైర్లు వేశాడట.?
Bandla Ganesh Guruji Salaha.. పవన్ కళ్యాణ్‌తో పెరిగిన దూరం..
‘దేవర’ పవన్ కళ్యాణ్‌తో ‘భక్తుడు’ బండ్ల గణేష్‌కి దూరం పెరిగింది. ఈ క్రమంలో ఆ ‘దేవర’ లిస్టులోకి జూనియర్ ఎన్టీయార్‌ని కూడా తీసుకొచ్చేశాడు బండ్ల గణేష్.
‘నా టైటిల్ కొట్టేశారు..’ అంటూ ‘దేవర’ టైటిల్ మీద సోషల్ మీడియాలో సెటైరేసి, ‘ఎన్టీయార్ కూడా నాకు దేవర లాంటోడే..’ అని బండ్ల చెప్పడం గమనార్హం.
త్రివిక్రమ్ శ్రీనివాస్ వల్లనే పవన్ కళ్యాణ్‌తో తనకు దూరం పెరిగిందని బండ్ల గనేష్ చెబుతున్నాడు.. వాపోతున్నాడు కూడా.!
తప్పు కదా బండ్లన్నా..
ఎవరో మధ్యన దూరిపోతే, తగ్గిపోయే అనుబంధమా పవన్ కళ్యాణ్ – బండ్ల గనేష్ మధ్య వున్నది.? అన్న ప్రశ్న సహజంగానే తెరపైకి వస్తుంది.

కష్ట కాలంలో పవన్ కళ్యాణ్ వెంట నిలబడింది త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రమే. ఆ లెక్కన త్రివిక్రమ్ శ్రీనివాస్‌ని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభిమానించడంలో వింతేముంది.?
స్నేహితుడనేకంటే, గురువుగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌ని అభిమానిస్తానని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పదే పదే చెబుతుంటారు. అది బండ్ల గణేష్‌కి నచ్చడంలేదంతే.
కాగా, ‘గురూజీకి కథ చెబితే స్క్రీన్‌ప్లే రాసి, దానికి తగ్గట్టు మళ్ళీ కథను మార్చి, అనుకున్న కథని షెడ్‌కి పంపిస్తాడు అని టాక్ వుంది..’ అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు.
Also Read: నాన్నంటే నరకం: బాంబు పేల్చిన సీనియర్ నటి ఖుష్బూ!
దానికి రిప్లయ్ ఇస్తూ, ‘అదే కాదు.. భార్యాభర్తల్ని, తండ్రీ కొడుకుల్ని, గురు శిష్యుల్ని ఎవర్నైనా వేరు చేస్తాడు అనుకుంటే.. అది మన గురూజీ స్పెషాలిటీ..’ అంటూ బండ్ల గణేష్ ట్వీటేశాడు.
మేటర్ అర్థమవుతోంది కదా.! బండ్ల గణేష్ (Bandla Ganesh) గురూజీ మీద ఎంత మంటతో వున్నాడో.!
అన్నట్టు, అన్నదమ్ముల్ని, భార్యాభర్తల్ని కూడా గురూజీ విడదీయగలడంటూ మరో ట్వీటులో బండ్ల గణేష్ పేర్కొనడం కొసమెరుపు.!
భగవంతుడికీ భక్తుడికీ అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి.. భగవంతుడికి భక్తుడిని దూరం చేసేది గురూజీ దర్బార్ సుత్తి.. అంటూ ఇంకో ట్వీటులో బండ్ల ఘాటైన సెటైర్లేశాడు.