Bandla Ganesh Mega Gossip.. సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. గత కొంతకాలంగా సినిమాల నిర్మాణానికి దూరంగా వున్న సంగతి తెలిసిందే.!
ఒకప్పుడు, సూపర్బ్ కాంబినేషన్స్ అలవోకగా సెట్ చేసిన నిర్మాత బండ్ల గణేష్. దర్శకులకీ, హీరోలకీ ఖరీదైన బహుమతులు ఇచ్చి మరీ, కాంబినేషన్లు సెట్ చేస్తాడన్న పేరుంది బండ్ల గణేష్‌కి.
తన వ్యాపారాలు, ఆపై.. రాజకీయ స్నేహాలు.. వెరసి, సినిమా కాకుండా ఇతర వ్యవహారాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాడు బండ్ల గణేష్.
కానీ, మొన్నీమధ్యనే భారీయెత్తున దీపావళి వేడుకల్ని నిర్వహించాడు ఈ నటుడు, నిర్మాత. ఆ దీపావళి వేడుకల్లో, మెగాస్టార్ చిరంజీవి ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
Bandla Ganesh Mega Gossip.. కోట్లు ఖర్చు చేసి మరీ దీపావళి సంబరాలు..
కోట్లు ఖర్చు చేసి మరీ, దీపావళి వేడుకల్ని సినీ పరిశ్రమలోని ప్రముఖుల కోసం బండ్ల గణేష్ నిర్వహించడం హాట్ టాపిక్‌గా మారింది.
తాజాగా, బండ్ల గణేష్ నిర్మాతగా చిరంజీవి హీరోగా ఓ సినిమాకి రంగం సిద్ధమయ్యిందన్న ప్రచారం తెరపైకొచ్చింది.
నిజానికి, ఇదేమీ కొత్త గాసిప్ కాదు. చాలాకాలం క్రితం గాసిప్ ఇది. దానికి, కాస్త మసాలా దట్టించింది ఓ ‘తెగులు వెబ్ సైట్’.
అలా, ఆ గాసిప్ సరికొత్తగా ప్రచారంలోకి రావడానికి, తెరవెనుకాల పెద్ద కథే నడిచింది. ‘కె-ర్యాంప్’ సినిమా విజయోత్సవ సభలో, బండ్ల గణేష్, సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఆ వ్యాఖ్యలు, విజయ్ దేవరకొండ మీద సెటైర్లంటూ తెలుగు సినీ మీడియా అంతా కోడై కూస్తోంది. బండ్ల గణేష్ మీద విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ గుస్సా అయ్యారు.
గాసిప్పుల తెగులు.!
వాళ్ళందర్నీ, మెగాస్టార్ చిరంజీవి మీదకు మళ్ళించేందుకోసం సదరు ‘తెగులు’ వెబ్సైట్, చిరంజీవితో బండ్ల గణేష్ సినిమా.. అనే గాసిప్ సృష్టించింది.
ఇలాంటివి ఎన్ని చూసి వుంటాబు బండ్ల గణేష్. అందుకే, అస్సలు ఆలస్యం చేయకుండా.. ఆ గాసిప్ విషయంలో క్లారిటీ ఇచ్చేశాడు.
ఎవరితోనూ సినిమా నిర్మాణానికి సంబంధించి సంప్రదింపులు ప్రారంభించలేదనీ, తనను ఇబ్బంది పెట్టొద్దనీ బండ్ల గణేష్ ట్వీటేశాడు.
Also Read: ప్రియాంక చోప్రా జోనాస్.. రెమ్యునరేషన్ ఎంత.?
నిజానికి, బండ్ల గణేష్ ట్వీట్ చాలా వినమ్రంగా వుంది.! కానీ, పెంటలో ముంచిన చెప్పుతో సదరు ‘తెగులు 360’ వెబ్ సైట్‌ని బండ్ల గణేష్ కొట్టాడన్న చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది.
‘కె-ర్యాంప్’ విజయోత్సవ వేదికపై మెగాస్టార్ చిరంజీవిని ప్రస్తావిస్తూ, ఆయన మీద తన అభిమానాన్ని బండ్ల గణేష్ చాటుకోవడాన్ని, కుల తెగులు 360 వెబ్ సైట్ అస్సలు జీర్ణించుకోలేకపోయింది.
