Bandla Ganesh Vs Vijayasai Reddy.. ఎవరి స్థాయి వారికి వుంటుంది.! రిక్షా నడిపి జీవనం సాగించేవాడికైనా.. రాష్ట్రపతికైనా.. ఎవరి వ్యక్తిత్వం, ఎవరి స్థాయి వారిది.
ఉన్నత పదవుల్లో వున్నవారు గొప్పవారనీ.. ఆ పదవులు లేకపోతే స్థాయి తక్కువ వారనీ అనగలమా.?
పదవి అంటే అది ఓ బాధ్యత. అంతే తప్ప, పదవిలో వుండడం ‘స్థాయి’ కానే కాదు. అసలు ఇక్కడ ‘స్థాయి’ గురించిన చర్చ ఎందుకు వస్తోంది.?
కమ్మ సామాజిక వర్గంపై వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి (Vijaya Sai Reddy) అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నది సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) ఆరోపణ.
ఇద్దరూ ఒకరి మీద ఒకరు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసుకున్నారు. తిట్టుకున్నారు.. కుక్క, గజ్జి కుక్క.. పిచ్చి కుక్క.. మోసం కుక్క.. అంటూ పరస్పరం దూషణలకు దిగారు.
Bandla Ganesh Vs Vijayasai Reddy బండ్ల గణేష్ రైటా.? విజయసాయి రెడ్డి రైటా.?
బండ్ల గణేష్ వాదనలో కొంత క్లారిటీ వుంది. అదేంటంటే, వ్యక్తుల్ని తిట్టాలనుకుంటే ఎవరైనా తిట్టుకోవచ్చనీ.. కులానికి దాన్ని ఆపాదించవద్దని. ఇందులో నిజానికి తప్పు పట్టడానికేమీ లేదు.
ఇక్కడే, విజయసాయిరెడ్డి ‘స్థాయి’ ప్రస్తావన తెచ్చారు. అంతే కాదు, చంద్రబాబుని (Nara Chandrababu Naidu) సీన్లోకి లాగి.. బండ్ల గణేష్‌కి చంద్రబాబు బాస్.. అని విమర్శించారు.
‘నాకెవరూ బాస్ కాదు.. ఒక్క పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తప్ప..’ అంటున్నాడు బండ్ల గణేష్.
కొనుక్కుంటే రాజ్యసభ పదవులు అమ్ముడైపోతాయ్.!
నిజానికి, బండ్ల గణేష్ తలచుకుంటే విజయసాయిరెడ్డిలా ఎంపీ (రాజ్యసభ) అవడం చాలా తేలికైన పని. డబ్బులు పారేస్తే దక్కుతున్నాయి రాజ్యసభ పదవులు గత కొంతకాలంగా.
Also Read: పబ్బుకెళ్లి బజ్జీలు తినకూడదా అధ్యక్షా.?
అలా ఆ కోటాలో రాజ్యసభ సభ్యుడైన విజయ్ మాల్యా (Vijay Mallya) ఘనత, స్థాయి ఏంటో అందరికీ తెలిసిందే.
అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకెళ్ళిన విజయసాయిరెడ్డి ‘స్థాయి’ గురించి మాట్లాడితే ఎలాగన్నది బండ్ల గణేష్ వాదన. బండ్ల గణేష్ చాలా మోసాలు చేశాడన్నది విజయసాయిరెడ్డి ఆరోపణ.
ఈ ప్రసహనం ఇంకా కొనసాగుతుందా.? ఏమోగానీ.. ఒక్కటైతే నిజం.. పదవుల్ని బట్టి స్థాయి రాదు.!
చివరగా.. బాధ్యతగల పదవిలో.. ప్రజా ప్రతినిథిగా వున్న విజయసాయిరెడ్డి, ట్విట్టర్లో అయినా.. వాడే భాష విషయంలో మరింత బాధ్యతగా మెలగాలి.
కానీ, విజయసాయి రెడ్డి ట్వీట్లలో.. ఆయన వ్యక్తిత్వం, ఆయన చెప్పుకుంటున్న ‘స్థాయి’ కనిపిస్తుండడం శోచనీయం.