Bhagavanth Kesari Ganesh Anthem.. పండగ సందడి ముందే వచ్చేసింది.! ఔను, వినాయక చవితి సందడి ముందే వచ్చేసింది.. అదీ ‘భగవంత్ కేసరి’ కారణంగా.!
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘భగవంత్ కేసరి’ విడుదలకు సిద్ధమవుతోంది.
తాజాగా, ఈ సినిమా నుంచి ఓ లిరికల్ సాంగ్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘గణేష్ యాంథమ్’ పేరుతో విడుదల చేసిన ఈ సాంగ్ నిజంగానే, వినాయక చవితి సంబరాల్ని ముందే తీసుకొచ్చేసింది.
Bhagavanth Kesari Ganesh Anthem.. శ్రీలీల సెంటరాఫ్ ఎట్రాక్షన్..
‘భగవంత్ కేసరి’ సినిమాలో శ్రీలీల ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి, ఈ సినిమాకి ఆమే సెంటరాఫ్ ఎట్రాక్షన్.
శ్రీలీల (Sreeleela) పాటంటే.. డాన్సులు అదిరిపోవాల్సిందే.! పైగా, గణేష్ సంబరాల్ని ఉద్దేశించి రూపొందించిన పాట.
తీన్‌మార్ కాదు.. సౌ మార్.. అంటూ, బాలయ్యతో (Nandamuri Balakrishna) కలిసి శ్రీలీల వేసిన డాన్సులు.. వేరే లెవల్ అంతే.!
జస్ట్, ఈ లిరికల్ సాంగ్‌లో కొన్ని స్టెప్స్ మాత్రమే చూశాం. పాట మొత్తంలో శ్రీలీల డాన్సులు.. ఆ ఎనర్జీ వేరే లెవల్‌లో వుండబోతున్నాయ్.

బాలయ్య (Nandamuri Balakrishna) కోసం కొన్ని ట్రేడ్ మార్క్ సిగ్నేచర్ స్టెప్స్‌ని కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టార్ కంపోజ్ చేశాడు.
Also Read: విన్నారా.? విజయ్ దేవరకొండ సీక్రెట్ పెళ్ళంట.!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) సినిమాలో, బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.
విజయ దశమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘భగవంత్ కేసరి’.! ఈ ఏడాది విడుదలవుతున్న భారీ చిత్రాల్లో ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) కూడా ఒకటి.
బాలయ్య (Nandamuri Bala Krishna) సినిమాల్లోనే హయ్యస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ ‘భగవంత్ కేసరి’ సినిమాకి జరిగింది.
‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’ సినిమాల తర్వాత బాలయ్య నుంచి వస్తోన్న సినిమా ఇది.! తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.