Bigg Boss Telugu Eight.. మళ్ళీ వస్తోంది బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో.! ఈసారి సీజన్ నెంబర్ ఎనిమిది.! ప్రతిసారీ కొత్త సీజన్ అనగానే, కొత్త లోగో.. మామూలే.!
ఈసారి కూడా కొత్త లోగో వచ్చింది.! లోగో వస్తూనే, షో మీద వివాదాలూ షురూ అయ్యాయి. బిగ్ బాస్ అంటేనే వల్గారిటీ, ఈ ‘షో’ని అనుమతించకూడదంటూ డిమాండ్లు తెరపైకొస్తున్నాయ్.
కంటెస్టెంట్లు ఎవరు.? అన్నదానిపై బోల్డన్ని గాసిప్స్ చూస్తున్నాం. హోస్ట్‌గా ఇంకోసారి అక్కినేని నాగార్జున కనిపించనున్న సంగతి తెలిసిందే.
Bigg Boss Telugu Eight.. హోస్ట్‌ని మార్చెయ్యండ్రా.!
అసలంటూ ఆ ‘హోస్ట్’ని కూడా మార్చెయ్యాలనే డిమాండ్లు వస్తున్నా, బిగ్ బాస్ నిర్వాహకులకు ఇంకో ఆప్షన్ కనిపించడంలేదు.

జూనియర్ ఎన్టీయార్, నాని.. చెరో సీజన్‌కీ హోస్ట్‌లుగా వ్యవహరించారు. ఆ తర్వాత నాగార్జున చేతుల మీదుగానే నడుస్తూ వస్తోంది బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో.
పాపం.. అక్కినేని నాగార్జున మాత్రం ఇంతకు మించి ఏం చేయగలడు.? అవే టాస్క్‌లు.. అదే సోది.! కంటెస్టెంట్లు ముందుగానే పీఆర్ టీమ్స్ పెట్టుకుని హౌస్‌లోకి వెళతారు గనుక, వాళ్ళ ‘అతి’ తప్ప, అక్కేడమీ వుండదు.
చెత్త టాస్క్‌లు.. సొల్లు డ్రామా.!
హై ఓల్టేజ్ డ్రామా.. అని ప్రచారం చెయ్యడం తప్ప, నిజానికి అక్కడేమీ వుండదు. ఏ వీకెండ్ ఏ కంటెస్టెంట్ హౌస్ నుంచి వెళ్ళిపోతాడో ముందే, ఆడియన్స్‌కి తెలిసిపోతుంటుంది.
కానీ, హోస్ట్ మాత్రం హైడ్రామా క్రియేట్ చేస్తుంటాడు.. ప్రతిసారీ జరిగే తంతే ఇది.! అదిరిపోయే ట్విస్టులంటాడు.. బీభత్సమైన టాస్కులంటాడు.. కానీ, అన్నీ పాత చింతకాయ్ పచ్చడి వ్యవహారాలే.!
Also Read: ముచ్చటగా మూడోది.! జాన్వీ కపూర్ ఖాతాలో ఇంకోటి.!
నిజానికి, బిగ్ బాస్ రియాల్టీ షో అంటే, దానికి బోల్డంత హైప్ వుండేది ఒకప్పుడు. క్రమంగా ఆ రియాల్టీ షో ఇమేజ్ పాతాళానికి పడిపోయింది.
అయినా తప్పదు.. ప్రతి ఏడాదీ, తెలుగు సహా వివిధ భాషల్లో బిగ్ బాస్ రియాల్టీ షోలు నడుస్తూనే వున్నాయి.! ఎనిమిది తర్వాత తొమ్మిది కూడా వస్తుంది.! ఇదింతే.!