Chandrababu Naidu Gets Bail.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి బెయిలొచ్చింది.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి, దాదాపు యాభై రోజులుగా రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా వున్నారు చంద్రబాబు.
అనారోగ్య కారణాల రీత్యా, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం, చంద్రబాబుకి మద్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Chandrababu Naidu Gets Bail.. షరతులతో కూడిన బెయిల్..
చంద్రబాబు కోరుకున్న ఆసుపత్రిలో సొంత ఖర్చులతో వైద్య చికిత్స పొందవచ్చుననీ, నాలుగు వారాల అనంతరం సరెండర్ అవ్వాలనీ న్యాయస్థానం బెయిల్ షరతుల్లో పేర్కొంది.
మద్యంతర బెయిల్ కాలంలో సాక్షుల్ని ప్రభావితం చేసేలా చంద్రబాబు వ్యవహరించకూడదన్నది మరో షరతు. ష్యూరిటీ షరతులు మామూలే.
కాగా, చంద్రబాబుని మళ్ళీ అరెస్టు చేసేందుకోసమే అన్నట్లుగా, నిన్నటికి నిన్న లిక్కర్ స్కామ్ కేసులో ఆయన్ని ఏపీ సీఐడీ ఏ3 నిందితుడిగా పేర్కొంది.
ఆ లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు తరఫు న్యాయవాదులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
జెయిలు.. బెయిలు.. ఇదేనా అర్హత.?
ఇదిలా వుంటే, తాజాగా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యేందుకు కీలకమైన అర్హత సాధించారంటూ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పడుతున్నాయి.
అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద దాదాపు 30కి పైగా కేసులున్నాయి. ఆయా కేసుల్లో రిమాండ్ ఖైదీగా సుమారు ఏడున్నర సంవత్సరాలు జైల్లో వున్నారు.
ప్రస్తుతం ఆయన బెయిల్ మీదనే వున్నారు. సో, వైఎస్ జగన్ తరహాలోనే చంద్రబాబు కూడా అరెస్టయి, జైల్లో వుండి బెయిల్ మీద విడుదలయ్యారు గనుక.. ముఖ్యమంత్రి పదవికి అర్హత సాధించారంటూ సెటైర్లు పడుతున్నాయి నెటిజనం నుంచి.
ఇదిలా వుంటే, హైద్రాబాద్‌లో చంద్రబాబు వైద్య చికిత్స పొందనున్నారు. కంటి సమస్యలు సహా, ఇతరత్రా అనారోగ్య సమస్యలకు ఆయన చికిత్స పొందుతారు.
Also Read: పవన్ కళ్యాణ్‌తో బాలకృష్ణ కలిస్తే.! ‘కమ్మ’గా ‘కాపు’ కాసే కలయికే.!
వివిధ నేరాలకు సంబంధించి, నేరాభియోగాలకు సంబంధించి, నేరారోపణలకు సంబంధించి.. న్యాయ ప్రక్రియలో బెయిల్ అన్నది సర్వసాధారణమైన విషయం.!
న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు, ఆదేశాలకు వక్రభాష్యాలు చెప్పడం రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్యలా మారిపోయింది.! శాసనాలు చేసేది రాజకీయ వ్యవస్థ. ఆ రాజకీయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థను గౌరవించకపోతే ఎలా.?