Table of Contents
Chiranjeevi Balakrishna Cinema Politics.. సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకి నోటి దురుసు చాలా చాలా ఎక్కువ. ఇది అందరికీ తెలిసిన విషయమే.
హిందూపురం ఎమ్మెల్యే అయినా, చట్ట సభల్లో నందమూరి బాలకృష్ణ కనిపించేది చాలా చాలా తక్కువ. ప్రజా సమస్యలపై మాట్లాడేది ఇంకా ఇంకా తక్కువ.
ఎప్పుడన్నా బాలయ్య నోరు విప్పారంటే, అంతే సంగతులు.! అదే, ఇంకోసారి జరిగింది. ఈసారి బాలయ్య పిచ్చితనం, నిండు సభ సాక్షిగా బయటపడింది.
Chiranjeevi Balakrishna Cinema Politics.. ఎందుకింత సైకోయిజం.?
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి, ‘సైకోగాడు’ అంటూ సంబోదించారు నందమూరి బాలకృష్ణ. అంతే కాదు, ఓ అధికారిని ఉద్దేశించి, ‘ఎవడు’ అని కూడా అన్నారు బాలయ్య.
చట్ట సభల్లో మాట్లాడేటప్పుడు, ఒకింత హుందాతనం అవసరం. వైసీపీ హయాంలో, నోరు జారిన అప్పటి ప్రజా ప్రతినిథులకు, తిరిగి చట్ట సభల్లోకి వెళ్ళే అవకాశమే దక్కలేదు.
ప్రజలు అన్నీ గమనిస్తుంటారు. అప్పుడు వైసీపీ విషయంలో అయినా, ఇప్పుడు కూటమి విషయంలో అయినా.. ప్రజల్ని పరిగణనలోకి తీసుకుని, చట్ట సభల్లో నోరు అదుపులో పెట్టుకోవాలి.
చిరంజీవి ప్రస్తావన ఎందుకు.?
మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, వైసీపీ హయాంలో సినీ పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందులు, ఈ క్రమంలో చిరంజీవి పెద్ద మనసు చేసుకుని, అప్పటి ప్రభుత్వంతో చర్చలు జరపడం గురించి ప్రస్తావించారు.
దాన్ని, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జీర్ణించుకోలేకపోయారు. మాట మీద అదుపు కోల్పోయారు. చిరంజీవిని సైతం, పరోక్షంగా తూలనాడే ప్రయత్నం చేశారు బాలయ్య.
అసలంటూ, చిరంజీవి ప్రస్తావన బాలకృష్ణ తెచ్చి వుండకూడదు. పనిగట్టుకుని, ఆ ప్రస్తావన బాలయ్య తెచ్చారంటే ఏంటి అర్థం.?

దీన్నే, మూర్ఖత్వం.. పిచ్చితనమంటారంటూ రాజకీయాల్లో అంతటా విమర్శలు వస్తున్నాయి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీద.
వైసీపీ శ్రేణులు, గతంలో బాలయ్య ఇంట్లో జరిగిన కాల్పుల ఘటన, తదనంతర పరిణామాల్లో బాలయ్య తెచ్చుకున్న ‘మానసిక స్థితిపై సర్టిఫికెట్’ వంటివి ప్రస్తావిస్తున్నాయి.
బాలయ్య అప్పుడెందుకు బాధ్యత తీసుకోలేదు.?
పరిశ్రమ తరఫున, అప్పటి ప్రభుత్వాన్ని కలిసేందుకు ప్రయత్నాలు జరిగితే, సినీ ప్రముఖుడిగా నందమూరి బాలకృష్ణ తనవంతు చొరవ చూపించి వుండాల్సింది.
అప్పట్లోనూ బాలయ్య, శాసన సభ్యుడే కదా.! కానీ, ఆయన బాధ్యత తీసుకోలేదు. పైగా, బాలయ్య అభిమాని జగన్.. అని అంటుంటారు.
అప్పటి వైసీపీ శాసన సభ్యురాలు, మంత్రి రోజాతో నందమూరి బాలకృష్ణకి సన్నిహిత సంబంధాలూ వున్నాయి. అయినా, బాలయ్య బాధ్యత తీసుకోలేదు.
ఇప్పుడేమో, చిత్ర విచిత్రమైన వాదనల్ని తెరపైకి తెస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వంతో సంప్రదింపుల కోసం ప్రముఖుల లిస్టు తయారు చేసి, అందులో తనది తొమ్మిదో పేరు వేశారంటూ అల్లరి చేశారు బాలయ్య.
ప్రభుత్వమెవరిది బాలయ్యా.?
ప్రభుత్వమెవరిది.? ప్రభుత్వంలో పెద్ద పార్టీ ఏది.? ఆ పార్టీ అధినేత, బాలయ్యకి ఏమవుతారు.? బాలయ్య నిలదీయాల్సింది ఎవర్ని.? ఇవేవీ చూసుకోకుండా, నోరు పారేసుకుంటే ఎలా.?
శాసన సభకి అసలు బాలయ్య ఒంటి మీద సోయతోనే వచ్చారా.? అన్నదిక్కడ మిలియన్ డాలర్ క్వశ్చన్.
కాగా, ఈ మొత్తం వ్యవహారంపై చిరంజీవి హుందాగా ప్రదర్శించారు. ఓ ప్రెస్ నోట్ చిరంజీవి పేరుతో విడుదలైంది. అందులో చిరంజీవి, అత్యంత బాధ్యతాయుతంగా వివరణ ఇచ్చారు.
Also Read: ‘మిరాయ్’ సమీక్ష: ఆ బడ్జెట్టూ.. ఆ వీఎఫ్ఎక్సూ! అందుకే ఈ సక్సెస్సూ!
వ్యక్తిగతంగా తనకు అప్పటి ప్రభుత్వం నుంచి ఎదురైన చేదు అనుభవాల్ని చిరంజీవి ప్రస్తావించలేదు. పరిశ్రమ కోసం తాను ఏం చేయగలిగిందీ ప్రస్తావించారంతే.
బాలయ్యకీ, చిరంజీవికీ చాలా తేడా వుంది.! నక్కకీ నాక లోకానికీ వున్నంత తేడా అది.!
