Chiranjeevi Jeevana Rekha Surekha.. పద్మ విభూషణుడు.. మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ వేశారు.!
సాధారణంగా చిన్న సినిమాల్ని ప్రోత్సహించేందుకు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాని ఎక్కువగా ఉపయోగిస్తుంటారన్నది అందరికీ తెలిసిన విషయమే.
తన సినిమాలకు సంబంధించి అయితే, లీకుల్ని ఇవ్వడానికి సోషల్ మీడియాని మంచి వేదికగా మలచుకుంటుంటుంటారు.
Chiranjeevi Jeevana Rekha Surekha.. సమ్‌థింగ్ స్పెషల్..
తాజాగా, చిరంజీవి తన సోషల్ మీడియా హ్యాండిల్ వేదికగా ట్వీట్ చేసిన ఇంట్రెస్టింగ్ విషయం విశేషం ఏమిటో తెలుసా.? తన సతీమణి సురేఖకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం.
ఇందులో విశేషం ఏముంది అంటారా.? అదే మరి, చిరంజీవి ప్రత్యేకత.! సినిమాల్లో చిరంజీవి టైమింగ్ గురించి కొత్తగా చెప్పేదేముంది.?
పంచ్ డైలాగులకు చిరంజీవి కేరాఫ్ అడ్రస్.! సెన్సాఫ్ హ్యూమర్ అనండీ, సమయస్ఫూర్తి అనండీ.. చిరంజీవి రూటే సెపరేటు.!
రేఖ.. రేఖ.. సురేఖ..
నా జీవన రేఖ
నా సౌభాగ్య రేఖ
నా భాగస్వామి సురేఖ !
Happy Birthday to my lifeline and the greatest pillar of my strength Surekha !
Many Many Happy Returns!
ఇదీ చిరంజీవి తాజా ట్వీట్.! నిజమే, సురేఖ అంటే, మెగాస్టార్ చిరంజీవి జీవన రేఖ.! అంతే కాదు, చిరంజీవికి సౌభాగ్య రేఖ కూడా సురేఖనే.!
Also Read: హరీష్ భాయ్.. నువ్వు ‘గ్రేట్’.! భలే ఏకిపారేశావోయ్.!
గ్రేటెస్ట్ పిల్లర్ ఆఫ్ మై స్ట్రెంగ్త్.. అని సురేఖ గురించి చిరంజీవి ట్వీట్ వేశారంటే.. చిరంజీవి తన భార్య పట్ల ఎంతటి ప్రేమాభిమానాల్ని కలిగి వున్నారో అర్థం చేసుకోవచ్చు.
తన సతీమణికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ చిరంజీవి వేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.! సేవా కార్యక్రమాల విషయంలో చిరంజీవికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుంటారు సురేఖ.
చిరంజీవికి వీలు కాని సందర్భాల్లో స్వయంగా తానే చిరంజీవి తరఫున వెళ్ళి, సాయం కోసం ఎదురుచూస్తున్నవారిని సురేఖ ఆదుకుంటుంటారు.