Chiranjeevi Keerthy Suresh Bholaashankar.. మెగాస్టార్ చిరంజీవి.. ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్.! ఔను, ఈ విషయంలో ఇంకో మాటకు తావు లేదు. ఆన్ స్క్రీన్ ఆయన ఎనర్జీ అన్ మ్యాచబుల్ అంతే.!
‘భోళా శంకర్’ సినిమాతో చిరంజీవి మరోమారు వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.
తమన్నా ఈ సినిమాలో హీరోయిన్. కీర్తి సురేష్ ఈ ‘భోళా శంకర్’ (Bholaa Shankar) సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది. మెహర్ రమేష్ దర్శకుడు.
Chiranjeevi Keerthy Suresh Bholaashankar.. చెల్లి.. చెలి.. అవసరమా ఇదంతా.?
ఈ సినిమా ప్రమోషన్ల సందర్భంగా, ఓ ఇంటర్వ్యూలో ‘మీరు చిరంజీవి చెల్లెలిగా నటించారు కదా.! హీరోయిన్‌గా నటించే అవకాశం వస్తే చేస్తారా..’ అని ప్రశ్నించారు.
దానికి, కీర్తి సురేష్ (Keerthy Suresh) సమాధానమిస్తే, ‘ఖచ్చితంగా చేస్తా..’ అని చెప్పింది.
మరోపక్క, ‘చెల్లెలి పాత్రలో నటించినంతమాత్రాన.. చెలి పాత్రలో నటించకూడదా.?’ అని చిరంజీవి (Mega Star Chiranjeevi) వ్యాఖ్యానించారు.

స్వర్గీయ ఎన్టీయార్ – సావిత్రి.. నటించిన ఒకప్పటి సినిమాల్ని ప్రస్తావించారు చిరంజీవి (Mega Star Chiranjeevi).
ఎన్టీయార్‌కి సోదరిగా సావిత్రి నటించారనీ, హీరోయిన్‌గానూ ఆమె నటించారనీ చిరంజీవి (Chiranjeevi) చెప్పుకొచ్చారు.
ట్రోలింగ్ షురూ.!
ఏ ఉద్దేశ్యంతో చిరంజీవి (Mega Star Chiranjeevi) ఆ ‘చెల్లి – చెలి’ అన్న ప్రస్తావన తెచ్చినా, అదిప్పుడు ట్రోలింగ్‌కి గురవుతోంది.
సోషల్ మీడియాలో చిరంజీవి (Mega Star Chiranjeevi) మీద నెగెటివ్ కామెంట్స్ చేస్తూ హోరెత్తించేస్తున్నారు హేటర్స్.!
Also Read: పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎంత ‘బ్రో’.? చెప్తావా.? చెప్పవా.?
తమిళ సినిమా ‘వేదాలం’కి ‘భోళా శంకర్’ (Bholaa Shankar) తెలుగు రీమేక్.. అన్న సంగతి తెలిసిందే.
అన్నట్టు, ‘భోళా శంకర్’ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy Suresh) చేసిన రోల్ తొలుత సాయి పల్లవి దగ్గరకు వెళ్ళింది. కానీ, రీమేక్ కావడంతో సాయి పల్లవి ఆ ఆఫర్‌ని తిరస్కరించిందామె.