Ys Jagan Janam Show.. రెండొందలిస్తే, రాజకీయ పార్టీల సభలకి జనం వచ్చేస్తారు.! కాకపోతే, సందర్భాన్ని బట్టి ఆ రేటు పెరిగిపోతూ వుంటుంది. అదీ, రెండొందల నుంచి రెండు వేల వరకూ.!
మహిళలకైతే ఖర్చు తక్కువే.! మగాాళ్ళకి మాత్రం, లిక్కర్ లాంటి అదనపు ఖర్చులూ వుంటాయ్. ఇది అన్ని రాజకీయ పార్టీలకూ వర్తిస్తుంది.
కాకపోతే, జన సేన లాంటి రాజకీయ పార్టీలకి జనాన్ని తరలించాల్సిన అవసరం వుండదు. ఎందుకంటే, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కి సినీ గ్లామర్ వుంది గనుక.
వైసీపీ విషయానికొస్తే, గత ఎన్నికల సమయంలో ‘సిద్ధం’ సభల్ని చూశాం. జనం పోటెత్తారు. లక్షల్లో జనం కనిపించారు ‘సిద్ధం’ సభల్లో.!
Ys Jagan Janam Show.. వైనాట్ 175 అంటే, పదకొండు.!
కానీ, ఎన్నికలొచ్చేసరికి.. వైసీపీకి పడాల్సిన స్థాయిలో ఓట్లు పడలేదు. ఆ జనాన్ని చూసి, ‘వై నాట్ 175’ అని జగన్ మురిసిపోయారు. కానీ, 11 సీట్లకు వైసీపీని జనం పరిమితం చేసేశారు.
అయినాగానీ, జనాన్ని సమీకరించడంలో వైసీపీ నాయకులు అస్సలు తగ్గడంలేదు. తాజాగా, తూర్పుగోదావరి జిల్లాకు వెళ్ళారు వైఎస్ జగన్.
ఎటు చూసినా జనం. జనమే జనం.! జన సంద్రం.! ఇసుకేస్తే రాలనంత జనం. జగన్ చుట్టూ ఎంతమంది వున్నారన్న విషయాన్ని పక్కన పెడితే, సమీపంలోని లిక్కర్ షాపులకి పోటెత్తారు జనం.
వైసీపీ జెండాలు పట్టుకుని ఓ రకంగా చెప్పాలంటే, లిక్కర్ షాపులపై మూకుమ్మడి దాడి చేసేశారు జగన్ పర్యటన నేపథ్యంలో జనం.
ఇస్తామని చెప్పిన డబ్బులు ఇవ్వలేదంటూ, జగన్ పర్యటన ముగిశాక జనం పెట్టిన శాపనార్థాలు అన్నీ ఇన్నీ కావు. ఓ టిఫిన్ సెంటర్ జగన్ పర్యటన కారణంగా ధ్వంసమయ్యింది.
బల ప్రదర్శన.. అత్యుత్సాహం..
వైఎస్ జగన్ హెలికాప్టర్ దగ్గర కూడా హంగామా. పోలీసులు, భద్రతా సిబ్బంది.. ఆ జనాన్ని అదుపు చేయడానికి నానా తంటాలూ పడాల్సి వచ్చింది.
కొందరైతై, వైఎస్ జగన్ మీదకు దూసుకొచ్చారు. అందులో కొందరు పెయిడ్ ఆర్టిస్టులు చొక్కాలు చించేసుకుని జగన్ ముందు ‘షో’ చేశారు కూడా.!
ఎందుకివన్నీ.? ఖర్చు దండగ వ్యవహారాలు కాకపోతే.? ఇలా తీసుకొచ్చినవాళ్ళతో వైసీపీకి ఏంటి లాభం.? ప్చ్.. ఏమీ వుండదు.! స్థానిక నాయకుల జేబులకు చిల్లు పడుతుందంతే.
ఎన్నికల్లో ఓడిపోయాక, ‘ఏమైపోయిందో ఈ అభిమానం, ఆప్యాయత..’ అంటూ వైఎస్ జగన్ కంటతడి పెట్టారు గుర్తుందా.? మరి, ఇలాంటి ‘షో’ తర్వాత, ఇంటికెళ్ళి కూడా వైఎస్ జగన్ అదే మాట అనుకుంటారు కదా.?
అన్నట్టు, జగన్ తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళింది పొగాకు రైతుల కష్టాల గురించి. పోనీ, ఆ రైతులకి వైఎస్ జగన్ ఏమైనా వ్యక్తిగత సాయం చేస్తారా.? అంటే, చెయ్యరుగాక చెయ్యరు.
ఇంతకీ, జగన్ తూర్పుగోదావరి పర్యటనకి ఎన్ని కోట్లు ఖర్చయినట్లు.?
