బంతిని గట్టిగా ఎవడు బాదగలడో.. వాడే మొనగాడు మోడ్రన్ క్రికెట్‌లో. పొట్టి క్రికెట్.. అదేనండీ టీ20 పోటీల్లో ఈ బాదుడు మరీ ప్రత్యేకం. అందుకే పదకొండో ఆటగాడు కూడా బంతిని గట్టిగా కొట్టగలిగేలా ఇప్పుడు తర్ఫీదునిస్తున్నారు. కానీ, కరోనా (Covid 19 IPL New Sixer Rule) పుణ్యమా అని సిక్సర్ కొట్టాలంటే, బ్యాట్స్‌మెన్ ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలి.
బంతి గనుక బ్యాట్స్‌మెన్ కొట్టిన దెబ్బకి గాల్లోకి లేచి, స్టాండ్స్‌లోకి వెళ్లినా, స్టేడియం అవతల పడినా ఆ బంతి స్థానంలో మరో బంతి తప్పనిసరి. ఈ కొత్త రూల్, త్వరలో పునఃప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీల కోసం తీసుకొచ్చారు.
Also Read: Sachin Tendulkar.. ఈ క్రికెట్ దేవుడికి.. సాటెవ్వడు.!
కరోనా సెకండ్ వేవ్ భయంలోనూ, ఇండియాలోనే ఐపీఎల్ (Indian Premiere League) పోటీలు మొన్నా మధ్య జరిగాయి. కానీ, కరోనా ఉధృతమవడంతో, అర్ధాంతరంగా పోటీల్ని ఆపేశారు. ఎక్కడయితే, సీజన్ ఆగిపోయిందో అక్కడి నుంచి పునఃప్రారంభించనున్నారు. అయితే, ఈసారి యుఏఈలో ఈ పోటీలు జరుగుతాయి.
సిక్సర్ కొట్టినప్పుడు బంతి స్టేడియం బయటికి వెళ్లినా, స్టాండ్స్‌లోకి వెళ్లినా, దాన్ని వేరే వ్యక్తులు టచ్ చేసే అవకాశం ఉంటుంది కనుక, వారి కారణంగా ఆటగాళ్లకు కరోనా సోకే ప్రమాదముందన్న కోణంలో బీసీసీఐ, ఈ బంతి మార్పు నిర్ణయం తీసుకుంది.
Also Read: నో డౌట్.! అర్జంటుగా విరాట్ కోహ్లీని పీకెయ్యాల్సిందే.!
అంతా బాగానే ఉంది కానీ, ఓ బంతికి అలవాటు పడ్డ బౌలర్, లేదా, బ్యాట్స్‌మెన్, కొత్త బంతికి మళ్లీ అలవాటు పడడమంటే, కొంచెం కష్టమే. బౌలర్ కొత్త బంతిని తిప్పాలన్నా కష్టమే. బ్యాట్స్‌మెన్ కొత్త బంతిని అర్ధం చేసుకోవాలన్నా కష్టమే. కానీ, తప్పదు. కరోనా మహమ్మారికి భయపడి జాగ్రత్త పడాల్సిందే.
ఇంతకీ, బయటికి వెళ్లిన బంతుల్ని ఏం చేస్తారు.? ఇంకేం చేస్తారు.. తీసుకొచ్చి శానిటైజ్ చేసి, వాటిని డిస్‌ప్లేలో పెడతారట. కరోనా చాలా కామెడీగా క్రికెట్‌తో ఆడేసుకుంటోంది కదూ.