Devara On 10th October.. జూనియర్ ఎన్టీయార్ – కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘దేవర’ సినిమా, రానున్న ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సి వుంది.
అయితే, అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. తాజాగా, ‘దేవర’ కొత్త రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు.
కొత్త అనౌన్స్మెంట్ ప్రకారం చూసుకుంటే, అక్టోబర్ 10న ‘దేవర’ (Devara Movie) సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలి.!
కానీ, వస్తుందా.? వచ్చేయాలనే అనుకుందాం. అయితే, ఇది ఫస్ట్ పార్ట్ మాత్రమే.!
తొలుత ‘దేవర’ సినిమాని ఒకే భాగంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నా, ఆ తర్వాత రెండు భాగాలుగా మార్చాలనే నిర్ణయానికి వచ్చాడు దర్శకుడు.
Devara On 10th October.. సైఫ్ అలీ ఖాన్ గాయపడ్డంతో..
రెండిటితో సరిపెడతారా.? మూడు, నాలుగు.. అని ‘దేవర’ టీమ్ కొత్త పల్లవి అందుకుంటారా.? ఏమో, అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.
కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ గాయపడ్డాడు.! ‘దేవర’ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు సైఫ్ అలీ ఖాన్.
సైఫ్ అలీ ఖాన్ గాయపడ్డంతో, సినిమా షూటింగుకి బ్రేక్ పడింది. పూర్తిగా కోలుకుని, ‘దేవర’ షూటింగ్లో సైఫ్ అలీ ఖాన్ పాల్గొంటే తప్ప, ‘దేవర’ సినిమా ఎప్పుడొస్తుందన్నదానిపై పూర్తి క్లారిటీ రావడం కష్టమే.
అయినా.. ఊహాగానాలు ఆగట్లేదేంటో..
ఇంకోపక్క, ‘దేవర’ వచ్చేది, 2025 సంక్రాంతికే.. అన్న ప్రచారమూ జరుగుతోంది. కాదు కాదు, 2025 వేసవి.. అనే వాదనా లేకపోలేదు.
ఇంత గందరగోళం ఎందుకు.? అక్టోబర్ 10న సినిమా రిలీజ్ అన్న ప్రకటన తర్వాత కూడా ఈ ఊహాగానాలకు ఎందుకు ఆస్కారం కలుగుతోందబ్బా.?

అన్నట్టు, ఈ ‘దేవర’లో (Devara Movie) జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తోంది. తెలుగులో ఆమెకి ఇదే తొలి సినిమా.!
కాగా, ‘దేవర’ కొత్త రిలీజ్ డేట్‌తో విడుదల చేసిన పోస్టర్, ఇంతకు ముందు వచ్చిన ‘దేవర’ పోస్టర్లతో పోల్చితే, కాస్త భిన్నంగా కనిపిస్తోంది. అదే సమయంలో, పోస్టర్ విపరీతంగా ట్రోల్ అవుతోంది.
Also Read: తూనీగా.! తప్పు కదా.! అడ్డు తప్పుకో.!
సరిగ్గా మనసుపెట్టకుండా పోస్టర్ని డిజైన్ చేసి వదిలారన్న విమర్శలు, జూనియర్ ఎన్టీయార్ అభిమానుల నుంచే ‘దేవర’ టీమ్ మీద వస్తున్నాయి.