Deviyani Sharma Shaitan.. ఎవరీ భామ.? పలు సినిమాల్లో నటించిందిగానీ, పెద్దగా గుర్తింపు ఏమీ రాలేదు నటిగా.!
కానీ, ‘Save The Tigers’ అనే వెబ్ సిరీస్ ద్వారా పాపులర్ అయ్యింది. ఇంతలోనే, ఇంకో వెబ్ సిరీస్‌తో.. ఆ వెబ్ సిరీస్ విడుదల కాకుండానే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.
ఆమె పేరు దేవియాని శర్మ (Deviyani Sharma).! మోడలింగ్ నుంచి నటనా రంగంలోకి వచ్చింది.
Deviyani Sharma Shaitan.. అసలు విషయమేంటంటే..
‘సైతాన్’ (Shaitan) వెబ్ సిరీస్ త్వరలో హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా విడుదల కాబోతోంది. దీనికి సంబంధించిన ట్రైలర్ ఆల్రెడీ వచ్చేసింది.

‘యాత్ర’ (Yatra) సినిమాని తెరకెక్కించిన దర్శకుడు మహి వి రాఘవ (Mahi V Raghav), ఈ ‘సైతాన్’ వెబ్ సిరీస్‌కి దర్శకత్వం వహించాడు.
ఈ ‘సైతాన్’ (Shaitan) వెబ్ సిరీస్ నిండా బూతులు, హింస.. కనిపిస్తున్నాయి. ఫిమేల్ క్యారెక్టర్స్ కూడా అత్యంత అసభ్యకరంగా బూతులు మాట్లాడేస్తున్నారు ‘సైతాన్’లో.
ఇంకేముంది.? ‘ఈ బూతుల్ని నిషేధించాలి.. వెబ్ సిరీస్‌లకీ సెన్సార్ కట్స్ వుండాలి..’ అనే డిమాండ్లు పెరిగాయి.
ప్రేమ కథ.. కుటుంబ కథా చిత్రమ్..
అయితే, దేవియాని శర్మ (Deviyani Sharma) మాత్రం.. ఇదొక ప్రేమ కథ అంటోంది. అంతేనా.? కుటుంబ కథా చిత్రమ్.. అని కూడా చెబుతోందామె.!
Also Read: Kajol Devgn.. కాజోల్ ‘అతి’ కష్టమైన పరీక్ష.! ఏంటది.?
మన సమాజంలో.. భిన్నమైన వ్యక్తులుంటారు.. అలాంటి కొందరి వ్యక్తుల కథ ఇది. వాళ్ళకీ ఎమోషన్స్ వుంటాయి.. వాళ్ళ వాడుక భాష అది.. అని సెలవిచ్చింది దేవియాని శర్మ.

అంటే, ‘బూతులు కావు..’ అంటూ నీతులు చెబుతోందన్నమాట. తన పాత్ర చుట్టూ అందమైన ప్రేమ కథ కూడా వుంటుందన్నది ఆమె వాదన. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసింది.!
ఇదండీ వరస.!