Dikki Balisina Kodi.. అనగనగా ఓ డిక్కీ బలిసిన కోడి.! చికెన్ షాపు ముందుకెళ్ళి తొడకొట్టిందట.! ఆ తర్వాత ఏమవుతుందిట.? ఓ సినిమాలోని డైలాగ్ ఇది.!
సినిమా డైలాగ్ కాబట్టి, ఫక్కున నవ్వుకుంటాం.! రాజకీయాల్లో ఈ డైలాగ్ చెబితే, జనాలు మొహమ్మీద ఉమ్మేస్తారు.
నిజానికి, రాజకీయ నాయకులు ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు, మీడియా ప్రతినిథులు.. వాళ్ళ మొహాల మీద ఉమ్మెయ్యాలి.! కానీ, అలా జరగడంలేదు. అదే అసలు సమస్య.
సిగ్గొదిలేసిన మీడియా..
కొంతమంది మీడియా ప్రతినిథులు సిగ్గొదిలేశారు కూడా.! మేం ఏం మాట్లడతామో, అది మీరు సూపించుకోండని రాజకీయ నాయకులు ఆదేశిస్తే, ‘జీ హుజూర్’ అంటున్నారు.
బూతుల్ని సైతం యదాతథంగా చూపించేస్తున్నారు మీడియాలో. ఎలక్ట్రానిక్ మీడియా పైత్యమిది. డిజిటల్ మీడియా ద్వారా వచ్చిన ‘పోయేకాలం’ ఇది.!
ఇంతకీ, డిక్కీ బలిసిన కోడి అంటే ఏంటి.. ఆ మాటని ఓ ప్రజా ప్రతినిథి, పైగా బాధ్యతగల పదవిలో వున్న మహిళా నేత అనడమేంటి.? కాస్తంతైనా సిగ్గుండాలి కదా.? ‘నన్ను రేప్ చేస్తారా.? ఆ దమ్ముందా.?’ అని అడిగిన మహా సిత్తరాంగి ఆ రాజకీయ నాయకురాలు.
సో, డిక్కీ బలిసిన కోడి.. అంటూ ఆమె పదే పదే నోరు పారేసుకోవడంలో వింతేమీ లేదు. కాకపోతే, ఆమె ఎప్పుడూ తన డిక్కీని అద్దంలో చూసుకుని వుండదు. చూసుకుని వుంటే, అలాంటి మాట ఆమె నోట రాదు కూడా.!
Dikki Balisina Kodi.. డిక్కీ తప్ప ఇంకేమీ చేతకాదా.?
కాస్సేపు డిక్కీ సంగతిని పక్కన పెట్టి, నిన్ను ప్రజా ప్రతినిథిని చేసిన నీ ప్రజలకు నువ్వేం చేశావో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవమ్మా సిత్తరాంగీ.!
ప్రజల్ని ఉద్ధరించాల్సిన పదవి కూడా దక్కింది.. ఆ జనానికీ.. తద్వారా ఆ నియోజకవర్గానికీ, రాష్ట్రానికీ, దేశానికీ.. నీ వల్ల ఏం ఒరిగింది.? అన్నదొక్కసారి వెనక్కి తిరిగి చూసుకో (డిక్కీని కాదు) ఆ తర్వాత నీకే అర్థమవుతుంది.!
Also Read: మూర్తిగారూ.! అప్పుడెప్పుడో.. ఆ స్నేహం.!
నోరుంది కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడేస్తే ఎలా.? సభ్యత, సంస్కారం మర్చిపోతే ఎవరైనా అంతకన్నా ఛండాలంగా మాట్లాడగలరు.
అయినా, బూతులే రాజకీయ భవిష్యత్తు.. అనే భ్రమల్లో వున్నవారిలో ‘మంచి మార్పు’ వస్తుందని ఆశించడం మూర్ఖత్వం.
కాకపోతే, మీడియా కనబడితే చాలు, నోటికి హద్దూ అదుపూ లేకుండా పోతున్న రాజకీయ నాయకుల్ని చూస్తే.. రాజకీయ వ్యవస్థ మీద ప్రజల్లో అసహ్యం, జుగుప్స.. నానాటికీ పెరిగిపోతోంది మరి.!
నీ మాటల్ని నీ పిల్లలు, కుటుంబ సభ్యులైనా హర్షిస్తారా.? వాళ్ళ దగ్గరా ఇలాగే మాట్లాడతావా.? అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏంటి పరిస్థితి.?
చివరగా.. డిక్కీలోంచి అశుద్ధం బయటకు వస్తుంది.. ఆ డిక్కీ గురించి మాట్లాడే ‘చెత్త’రాంగి నోట్లోంచి వచ్చే మాటలు అశుద్ధం కంటే ఛండాలంగా వుంటున్నాయ్.!