ప్రపంచం మారిపోయింది. చాలా చాలా మారిపోయింది. కాదు కాదు.. మనిషి ఆలోచనలే మారిపోతున్నాయ్.. పెళ్ళిలోనూ, చావులోనూ కొత్తదనం వెతుక్కుంటున్నారు.. నయా ట్రెండ్ బాటలో అదుపు తప్పుతున్నారు.. పెళ్ళంటే ‘నూరేళ్ళ పండగ’ అనేది ఒకప్పటి మాట. ‘మూన్నాళ్ళ ముచ్చట’ (Divorce Becomes Equal To Break-Up) అని చాలామంది చెబుతున్న ఇప్పటి మాట. పెళ్ళి కోసం లక్షలు, కోట్లు ఖర్చు చేయడానికి వెనుకాడ్డంలేదు.
అభిప్రాయాలు కలిస్తేనే ప్రేమ పుడుతుంది, ఒకరి అభిప్రాయాల్ని ఇంకొకరు గౌరవించుకోవడం ద్వారా ఆ ప్రేమ బంధం ఇంకాస్త బలపడి, వైవాహిక బంధానికి దారి తీస్తుంది. కానీ, కొన్ని బంధాలకు ’బలం‘ చాలా తక్కువ. అందుకేనేమో, రోజుల తరబడి, నెలల తరబడి పెళ్ళి కోసం ఏర్పాట్లు చేసుకుంటారుగానీ, విడిపోవడానికి పెద్దగా సమయం తీసుకోరు.
అలాగని, విడిపోయినోళ్ళంతా చెడ్డోళ్ళని కాదు. కానీ, బంధాలు నిలబెట్టుకోవడంలో చాలామంది సరైన కారణాలు లేకుండానే విఫలమవుతున్నారన్నది (Divorce Becomes Equal To Break-Up) నిర్వివాదాంశం. బెంగాలీ బ్యూటీ, తెలుగు సినిమాల్లో నటించిన ఓ అందాల భామ, విడాకుల వ్యవహారాన్ని ‘జస్ట్ బ్రేకప్’ అని అభివర్ణించింది.
కొన్నేళ్ళపాటు ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్ళి చేసుకుందిగానీ, ఏడాది కాలం కూడా వైవాహిక బంధాన్ని కొనసాగించలేక ’విడాకులు‘ తీసేసుకుంది. ఎందుకూ.? అని ప్రశ్నిస్తే, పరమ రొటీన్ సమాధానం ’అభిప్రాయ బేదాలొచ్చాయి. వైవాహిక బంధాన్ని కొనసాగిస్తూ, రోజూ తిట్టుకుని గొడవ పడటం కంటే.. విడిపోయి స్నేహితులుగా వుండాలనే నిర్ణయానికి వచ్చి, విడాకులు తీసుకున్నాం‘ అని చెప్పింది.
ఈ సమాధానం ఇప్పటిదాకా చాలామంది సెల్రబిటీలు చెప్పారు. పేర్లు రాసుకుంటూ పోతే అది చాంతాడంత లిస్ట్ అవుతుంది. సెలబ్రిటీల్లోనే కాదు, సామాన్యుల్లోనూ ఈ కొత్త ట్రెండ్ ఎక్కువగానే కనిపిస్తోంది. ఎక్కుడగా అధిక వేతనాలు పొందే ఉద్యోగాలు చేసే భార్యాభర్తల్లో ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.
కూరలో ఉప్పు తక్కువైందనో, ఎక్కువైందనో మొదలయ్యే గొడవలు, విడాకులకు దారి తీస్తున్నాయంటే, పెళ్ళికి ముందు ఎంత గొప్ప అవగాహనతో ప్రేమ సంబంధాలు కొనసాగించి, పెళ్ళి పీటలెక్కుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎవర్ని నిందించాలి.? అన్నది సమాధానం దొరకని ప్రశ్న.
ట్రెండ్ అలా తగలడింది. పెళ్ళి అనేది కూడా ఓ పబ్లిసిటీ స్టంట్ అయిపోయింది. జస్ట్ ఓ సరదా (Divorce Becomes Equal To Break-Up) ఈవెంట్ అయిపోయింది. అంతే, అంతకు మించి వివాహ బంధానికి పెద్దగా గౌరవం అనేది లేకుండా పోవడమే ఈ బ్రేకప్ విడాకులకి కారణంగా చెప్పుకోవాలేమో.