Elan Musk Twitter.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్, వ్యాపార కిటుకులు తెలిసినోడు.! డబ్బుని ఎలా రెట్టింపు, అంతకు మించి చేయాలన్నదానిపై ఎప్పుడూ లెక్కలేసుకుంటూ వుంటాడు.
ఎలాన్ మస్క్ ఎందుకు ట్విట్టరు పిట్టని తన ఆధీనంలోకి తీసుకోవాలనుకున్నాడు.? ఇదైతే మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఆయన వ్యాపారవేత్త.. సో, ట్విట్టరుని ఉద్ధరించేద్దామనీ, ప్రపంచానికి దాని ద్వారా మేలు చేసేద్దామని అనుకుని ట్విట్టరు పిట్టని తన పంజరంలో బంధించెయ్యలేదు.!
వద్దు మహాప్రభో.. మమ్మల్ని వదిలెయ్..
ట్విట్టర్ హెడ్‌గా పదవిలో వుండాలా.? పదవిలోంచి దిగిపోవాలా.? అనే అంశంపై ఎలాన్ మస్క్ స్వయంగా ఓ పోల్ పెట్టాడు.
ఇంకేముంది.? ‘నువ్వొద్దు మహాప్రభో..’ అంటూ ట్విట్టర్ యూజర్స్ కామెంట్లు పెట్టడం మొదలెట్టారు. అందరూ ఆయన్ని తప్పుకోమన్లేదండోయ్.. కానీ, మెజార్టీ ఆయన్ని తప్పుకోమన్నారు.
దాదాపు 57.5 శాతం మంది ఆయన్ని దిగిపోమన్నారు. 42.5 వాతం మంది మాత్రం, ట్విట్టర్ అధిపతిగా ఎలాన్ మస్క్ దిగిపోవద్దని కోరుకున్నారు.!
వాళ్ళ మాటల్ని మస్క్ వింటాడా.?
నలుగురికీ నచ్చే పని అస్సలు చేయడు ఎలాన్ మస్క్. ఏ పని అయినా, తనకు నచ్చితేనే చేస్తాడు. సో, పోల్ పెట్టింది టైమ్ పాస్ కోసమే అయి వుండొచ్చు.
Also Read: ఉస్తాద్ పవన్ కళ్యాణ్.! మనల్ని ఎవడ్రా ఆపేది.?
కొనుగోలు చేస్తూనే ట్విట్టర్ నుంచి చాలామంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించేశాడు మస్క్. విప్లవాత్మక మార్పులు.. అంటూ ఏవేవో చేశాడు.. బొక్కబోర్లా పడ్డాడు.
ఇప్పుడేమో దిగిపోవాలా.? వద్దా.? అంటూ ఓ పిచ్చి ప్రశ్న వేసి అడ్డంగా బుక్కయిపోయాడు ఎలాన్ మస్క్.