Ghattamaneni Jaanvi Swarup.. సినీ రంగంలో వారసుల రాక ఎప్పటి నుంచో వున్నదో. స్వర్గీయ ఎన్టీయార్ నట వారసత్వాన్ని నందమూరి బాలకృష్ణ పునికి పుచ్చుకున్నారు.
జూనియర్ ఎన్టీయార్, కళ్యాణ్ రామ్.. ఇలా చాలా మంది స్టార్లు వచ్చారు నందమూరి కుటుంబం నుంచి. ఏఎన్నార్ కుటుంబం నుంచి నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ సినీ రంగంలో వున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సహా చాలా మంది వెండితెరపై రాణిస్తున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు మహేష్. కొత్త తరంలో మహేష్ సోదరుడు రమేష్ బాబు కుమారుడు సినీ రంగంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.
Ghattamaneni Jaanvi Swarup.. మంజుల కుమార్తె.. గ్లామర్ ప్రపంచంలోకి..
తాజాగా మహేష్ సోదరి మంజుల కుమార్తై తెరంగేట్రానికి సిద్ధమైంది. మంజుల కూడా హీరోయిన్‌గా వెండితెరపై వెలిగిపోవాలనుకున్నారు. కానీ, కుదరలేదు. నటిగా పలు సినిమాల్లో కనిపించారామె.
మంజుల భర్త స్వరూప్ కూడా పలు సినిమాల్లో నటించారు. నటిస్తున్నారు. తాజాగా మంజుల – స్వరూప్ కుమార్తై జాన్వీ తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది.

చిరంజీవి సోదరుడు నాగబాబు కుమార్తై నిహారిక హీరోయిన్‌గా ట్రై చేసినా సక్సెస్ దొరకలేదు. దాంతో ఆమె నిర్మాతగా సినిమాలు చేస్తోంది.
‘కమిటీ కుర్రాళ్లు’ సినిమాతో నిర్మాతగా మంచి విజయం అందుకుంది నిహారిక. మంజుల కూడా పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించింది.
Also Read: స్నేక్ బ్యూటీ.! టచ్ చేస్తే, కాటేస్తది జాగ్రత్త.!
ఇక హీరోయిన్‌గా తెరంగేట్రానికి సిద్ధమైన ఘట్టమనేని జాన్వీ స్వరూప్ గ్లామర్ ప్రపంచంలో తారగా సక్సెస్ అవుతుందా.? వేచి చూడాలి.
