Ginger Juice Health Benifits.. పూర్వ కాలం నుంచీ ఎన్నో అనారోగ్య సమస్యలకు అల్లం మంచి పరిష్కారంగా వింటూ వస్తున్నాం. అయితే, కోవిడ్ తర్వాత అల్లం వాడకం మరింత పెరిగింది.
ఖచ్చితంగా అన్ని కూరల్లోనూ అల్లం విరివిగా వాడడం, అలాగే, అల్లంతో చేసిన పలు రకాల వంటకాల్ని తింటుండడం నేర్చుకున్నాం.
అయితే, అల్లంతో ఉదయాన్ని స్టార్ట్ చేస్తే ఆరోగ్యానికి ఇంకా మంచిదని సంబంధిత నిపుణులు చెబుతున్నారు.
Ginger Juice Health Benefits.. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా..
అల్లంతో ఉదయాన్ని ప్రారంభించడం అంటే.. పరగడుపున అల్లం తినడం అని అర్ధం. చాలా మంది పెద్ద వాళ్లలో ఈ అలవాటుంటుంది.
అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి దానికి కాస్తంత సాల్ట్ యాడ్ చేసి తింటుంటారు. ఇలా తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పటిష్టంగా వుంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

వయసుతో పాటూ వచ్చే మోకాలి నొప్పులు.. కీళ్ల వాతాలు వంటి సమస్యలు దూరంగా వుంటాయ్.
అయితే, అల్లాన్ని డైరెక్ట్‌గా తినడం కంటే, గోరు వెచ్చని నీటితో కలిసి రసంలా చేసి కాస్త తేనె కలుపుకుని తాగితే మరింత మెరుగైన ప్రయోజనాలుంటాయని అంటున్నారు.
పడగడుపునే ఇలా చేసినట్లయితే, ఖచ్చితంగా ఆరోగ్య ప్రయోజనాలుంటాయట. అల్లంలో సహజ సిద్ధమైన మెగ్నీషియం, జింక్, ఐరన్ పుష్కలంగా వుంటాయ్.
రోగ నిరోధక శక్తి తక్కువగా వున్నవారు తరచూ అనారోగ్యం బారిన పడుతుంటారు. రకరకాల ఇన్ఫెక్షన్లతో బాధపడుతుంటారు.
అలాంటి వారికి అల్లం రసం చక్కని పరిష్కారం. అంతేకాదు, ఒంట్లో అనవసరంగా నీరు చేరడం వల్ల కొందరిలో కాళ్ల వాపులు కనిపిస్తుంటాయ్.
నిత్య యవ్వనంగా..
అలా అనవసరమైన నీటిని బయటికి పంపించేందుకు అల్లం రసం బాగా ఉపయోగపడుతుంది. అల్లం వృద్ధాప్య ఛాయల్ని దరి చేరనీయకుండా చేస్తుంది.

చర్మాన్ని కాంతివంతంగా చేయడంతో పాటూ, ముఖంపై వచ్చే ముడతలు, నల్ల మచ్చల్ని నివారిస్తుంది. అన్ వాంటెడ్ హెయిర్ నిర్మూలించడంతో పాటూ, చర్మం, గోళ్ల ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ అల్లం కీలక పాత్ర వహిస్తుంది.
గుండెల్లో మంటగా అనిపిస్తే కాస్త అల్లం రసం తాగొచ్చు. లేదంటే, అల్లం టీ తాగినా ఫలితం వుంటుంది. మైగ్రేన్ తలనొప్పికీ అల్లం చికిత్స పరిష్కారమవుతుంది.
అల్లాన్ని మెత్తగా పేస్ట్‌లా చేసి, నుదుటిపై నొసల మధ్య పట్టులా వేస్తే మైగ్రేన్ బాధ నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే, అల్లంతో లాభాలు అన్నీ ఇన్నీ కావు.!
Also Read: మెదడు చురుగ్గా పని చేయాలంటే రోజూ గుడ్డు తినాల్సిందే.!
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్‌లో లభించిన కొంత సమాచారం ప్రకారం, కొందరు వైద్య నిపుణుల ద్వారా సేకరించబడిన సమాచారం మాత్రమే.
ఏ ఇంటి చిట్కా అయినా కేవలం కొంత పరిధి వరకూ మాత్రమే. సమస్య తీవ్రమైనది అయితే, సంబంధిత వైద్యుని సలహా తీసుకుని తగు సమయంలో చికిత్స చేయించుకోవల్సిందే.!