Table of Contents
Hari Hara Veera Mallu OTT.. ఓ కాంబినేషన్ సెట్ అవగానే ఓటీటీ సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి. నిజానికి, కాంబినేషన్‌ని సెట్ చేస్తున్నది కూడా ఓటీటీ సంస్థలేనా.?
తెలుగు సినిమాపై ఓటీటీ పెత్తనం గురించి ఇలాంటి చర్చ అంతటా ఎందుకు జరుగుతోంది.? నిజంగానే, తెలుగు సినిమాపై ఓటీటీ పెత్తనం, సహించలేని స్థాయికి పెరిగిపోయిందా.?
‘హరి హర వీర మల్లు’ సినిమా, పోస్ట్ పోన్ అవడంపై ‘ఓటీటీ’ సంస్థ కన్నెర్రజేసిందనీ, పది కోట్ల రూపాయల ‘కోత’ విధించిందనీ గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
Hari Hara Veera Mallu OTT.. హరి హర వీర మల్లు రిలీజ్ ఎప్పుడు.?
మేలో విడుదవ్వాల్సిన ‘హరి హర వీర మల్లు’ అనివార్య కారణాల వల్ల, జూన్ నెలకి వాయిదా పడింది. జూన్ దాటి జులైకి వెళుతుందా.? అన్న అనుమానాలైతే వున్నాయి.
వీఎఫ్ఎక్స్ విషయమై కొంత ఆలస్యం జరుగుతోందని నిర్మాత ఏఎం రత్నం ఇటీవల వ్యాఖ్యానించారు. పెద్ద సినిమాకి ఇలాంటి సమస్యలు మామూలే.
అయినాగానీ, ఆలస్యం అమృతం విషం. ఏ నిర్మాత కూడా, విడుదల తేదీ వాయిదా వేయాలని అనుకోడు. అనివార్య పరిస్థితుల్లో నిర్మాత కష్టంగానే, వాయిదాకి ఒప్పుకుంటాడు.
అన్ని సినిమాలదీ అదే పరిస్థితి..
విడుదలకు సిద్ధమవుతున్న చాలా సినిమాలకి ఓటీటీ సంస్థలు సవాలక్ష ఆంక్షల్ని విధిస్తున్నాయి. ఫలానా తేదీనే సినిమా విడుదలవ్వాలంటూ ఓటీటీ సంస్థలు పట్టుబడుతున్నాయి.
అంతేనా, సినిమా సినిమాకీ ఫలానా గ్యాప్ వుండాలని ఓటీటీ సంస్థలు, నిర్మాతలపై ఒత్తిడి తెస్తుండడం ఒకింత అభ్యంతరకరమే.
ఎవరి వ్యాపారం వారిది.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, సినిమా నిర్మాణంపై నిర్మాతకే అసహ్యం వేసేలా ఓటీటీ సంస్థలు వ్యవహరించకూడదు.
ఓటీటీ చేతిలో నిర్మాత బలి..
ఒక్కమాటలో చెప్పాలంటే, ఓటీటీ సంస్థల చేతిలో నిర్మాత కీలుబొమ్మలా మారిపోతున్నారేమో అన్న అనుమానం కలుగుతోంది.
Also Read: ‘లిటిల్ హార్ట్స్’ సమీక్ష: ఈ ‘తేడా’ వ్యవహారాలెందుకు చెప్మా.?
థియేటర్ల నుంచి వచ్చే ఆదాయం కంటే ఓటీటీ డీల్స్‌తో వచ్చే ఆదాయం ఎక్కువగా వుంటోందన్న కోణంలో, ఓటీటీ అనే బూతాన్ని పెంచి పోషించిందీ నిర్మాతలే.
చేసుకున్నోడికి చేసుకున్నంత.. పెంచి పోషించిన ఓటీటీ రక్కసి చేతిలో, నిర్మాతలు నలిగిపోవాల్సిందే.