Hi Nanna Nani Mrunal.. మీట్ మై ఫ్రెండ్ యష్నా.. అంటూ ఓ చిన్నారి చెప్పే డైలాగ్.. హై నాన్న.. అంటూ మృనాల్ ఠాకూర్, నానితో షేక్ హ్యాండ్ ఇవ్వడం.!
అసలేంటిదంతా.? పోస్టర్‌లోనేమో నాని భుజాల మీద ఓ చిన్నారి కూర్చుంటుంది.. ఫోన్‌లో నాని బిజీగా వుంటాడు.. మరో ఫోన్‌లో హీరోయిన్ మృనాల్ బిజీగా వుంటూనే, చిన్నారి వైపు చూస్తోంది.!
నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) హీరోగా తెరకెక్కుతున్న సినిమా టైటిల్ ‘హయ్ నాన్న’ తాజాగా రివీల్ అయ్యింది. దాంతోపాటే, గ్లింప్స్ కూడా విడుదల చేశారు.
అసలేంటి కథ.?
హీరో.. హీరోయిన్.. మొబైల్ ఫోన్లు.. ఓ చిన్నారి.. ఆ చిన్నారికి తండ్రి నాని (Natural Star Nani), హీరో.! మరి, మృనాల్ ఠాకూర్ (Mrunal Thakur) ఎవరు.?
మీట్ మై ఫ్రెండ్ యష్నా.. అంటూ ఆ చిన్నారి, ఎవరికి మృనాల్ ఠాకూర్‌ని (Mrunal Thakur) పరిచయం చేస్తోంది.?

హీరో నానికి (Natural Star Nani) షేక్ హ్యాండ్ ఇస్తూ, ‘హాయ్ నాన్నా’ అని మృనాల్ ఠాకూర్ (Mrunal Thakur) ఎందుకు పలకరించింది.?
ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే ‘హాయ్ నాన్నా’ సినిమా చూడాల్సిందే. గ్లింప్స్ మాత్రం అదిరిపోయింది.. అదీ ఓ రేంజ్‌లో.
నాని.. అదరగొట్టేశావ్.!
నాని చాలా మంచి నటుడు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ‘దసరా’ తర్వాత కంప్లీట్ మేకోవర్‌తో చేస్తున్న సినిమా ఈ ‘హాయ్’ నాన్నా.!
గ్లింప్స్ చూస్తోంటేనే.. గుండె బరువెక్కిపోతుంది.. నాని ఓ సన్నివేశంలో ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ అలాంటిది. చిన్నారి వాయిస్.. ఈ గ్లింప్స్‌లో వేరే లెవల్ అంతే.
శౌర్యువ్ దర్శకత్వంలో ఈ ‘హాయ్ నాన్న’ సినిమా తెరకెక్కుతోంది. డిసెంబర్ 21న ‘హాయ్ నాన్న’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Also Read: ‘సలార్’ టీజర్.! ప్రభాసూ.. నువ్వెక్కడ బాసూ.!
తెలుగుతోపాటు పలు భాషల్లో ఈ ‘హాయ్ నాన్న’ సినిమా విడుదల కాబోతోంది. పాన్ ఇండియా సినిమా అనుకోవచ్చు.!