Table of Contents
Hrithik Roshan Tollywood.. మన తెలుగు హీరో బాలీవుడ్‌కి వెళ్ళాడు.. సగటు తెలుగు సినీ అభిమానికి గర్వకారణమైన విషయమిది.
ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడు, తెలుగు సినీ పరిశ్రమకి వస్తే, టాలీవుడ్‌కి గర్వకారణమైన విషయమది.
ఔను, జూనియర్ ఎన్టీయార్ ‘వార్-2’ సినిమాతో హిందీ సినీ పరిశ్రమకి పరిచయమవుతున్నాడు. నిజానికి, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతోనే నార్త్ ఆడియన్స్‌ని జూనియర్ ఎన్టీయార్ పలకరించాడు.
కాకపోతే, ‘ఆర్ఆర్ఆర్’ తెలుగు సినిమా.. హిందీ డబ్బింగ్ వెర్షన్, అక్కడ సంచలనాలు సృష్టించింది. సౌత్ నుంచి, అందునా తెలుగు సినీ పరిశ్రమ నుంచి బోల్డంతమంది బాలీవుడ్‌కి వెళ్ళారు.
Hrithik Roshan Tollywood.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి..
చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, రామ్ చరణ్, రాణా దగ్గుబాటి.. ఇలా పలువురు స్ట్రెయిట్‌గా బాలీవుడ్‌లో సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్‌కి స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమా అంటే, ‘ఆదిపురుష్’.!
‘వార్-2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, హృతిక్ రోషన్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేస్తున్నాం.. అని చెప్పుకొచ్చాడు.
‘చిమ్టూ’ అని ముద్దుగా నాగవంశీని పిలుస్తుంటారు కొందరు. ఇలాంటి, మతిలేని వ్యాఖ్యలు చేస్తుంటాడు కాబట్టే, ‘చిమ్టూ’ అన్న పేరు వచ్చిందతనికి.
‘కహో నా ప్యార్ హై’ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు హృతిక్ రోషన్. అదీ, చాలా ఏళ్ళ క్రితం.
చాలా సినిమాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో..
ఆ తర్వాత బోల్డన్ని సినిమాలతో (డబ్బింగ్ వెర్షన్స్) తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానం హృతిక్ రోషన్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే.
హృతిక్ రోషన్ సినిమాలంటే, ఎగబడి చూసే ప్రేక్షకులున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో. ‘క్రిష్’ సిరీస్ సినిమాలతో అయితే, చిన్న పిల్లలకి, ‘సూపర్ హీరో’ అయిపోయాడు హృతిక్ రోషన్.
తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాత నాగవంశీ. అయితే, ‘వార్-2’ సినిమాకి ఆయన నిర్మాత కాదు. జస్ట్, తెలుగు వెర్షన్‌ని ఆయన రిలీజ్ చేస్తున్నాడంతే.
నాగవంశీ వ్యాఖ్యలు, హృతిక్ రోషన్ ఫ్యాన్స్‌ని బాగా హర్ట్ చేశాయ్. బాలీవుడ్ సినీ జనాలూ గుస్సా అవుతున్నారు. నార్త్ ఆడియన్స్ కూడా, మండిపడుతున్నారు.
ఆ మంటలో జూనియర్ ఎన్టీయార్ మలమలా..
ఆ మంట కాస్తా, జూనియర్ ఎన్టీయార్ మీదకి మళ్ళుతోంది. జూనియర్ ఎన్టీయార్ మీద విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోందిప్పుడు.! సోషల్ మీడియా రోజులివి మరి.!
నిన్న హైద్రాబాద్‌లో ‘వార్-2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే, హృతిక్ రోషన్ చాలా హుందాగా మాట్లాడాడు.
Also Read: Sarzameen Telugu Review: తండ్రీ కొడుకుల మధ్య యుద్ధం.!
జూనియర్ ఎన్టీయార్ ‘అతి’ మామూలే. దానికి తోడు, ‘చిమ్టూ’ నాగవంశీ చేసిన వ్యాఖ్యలతో.. కొత్త వివాదం షురూ అయ్యింది.
అవసరమా ఇదంతా.? ఓహో, వివాదమే.. సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెడుతుందని నాగవంశీ అనుకున్నాడా.?