Janhvi Kapoor Jr NTR.. బాలీవుడ్ బ్యూటీ, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తెలుగు సినీ పరిశ్రమలోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందన్నదానిపై చాలాకాలంగా గాసిప్స్ వినిపిస్తూనే వున్నాయ్.!
‘అబ్బే అలాంటిదేమీ లేదు.. కానీ, ఖచ్చితంగా తెలుగు సినిమాల్లో జాన్వీ కపూర్ నటిస్తుంది.. ఇప్పటికైతే ఏ సినిమాకీ కమిట్ అవలేదు..’ అని జాన్వీ కపూర్ తరఫున ఆమె తండ్రి బోనీ కపూర్, తన కుమార్తె విషయంలో వచ్చే గాసిప్స్‌ని ఖండిస్తూ, క్లారిటీ ఇచ్చేస్తున్నారు.
తాజాగా, ఇంకోసారి జాన్వీ కపూర్ పేరు ప్రచారంలోకి వచ్చింది.. ఆమె ఓ తెలుగు సినిమాకి కమిట్ అయ్యిందంటూ. కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీయార్ హీరోగా ఓ సినిమా తెరకెక్కున్న సంగతి తెలిసిందే.
అతిలోక సుందరి కుమర్తె తెలుగు నేలకు దిగొస్తుందా.?
తొలుత ఈ సినిమా కోసం ఎన్టీయార్ సరసన హీరోయిన్‌గా అలియా భట్ (Alia Bhatt) పేరు ఖరారైందంటూ వార్తలొచ్చాయి. అలియా కూడా, తాను యంగ్ టైగర్ సరసన ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించింది.

కానీ, ఏమయ్యిందో అలియా భట్ ఆ సినిమా నుంచి ఔట్ అయిపోయినట్లు వార్తలొచ్చాయ్. ఇంతలోనే, జాన్వీ కపూర్ (Janhvi Kapoor) పేరు ప్రచారంలోకి వచ్చింది.
జాన్వీ కపూర్ గనుక ఓకే చెయ్యకపోతే, చివరి ఆప్షన్‌గా అనన్య పాండే పేరుని అనుకుంటున్నారన్నది ఆ ప్రచారం తాలూకు సారాంశం.
Janhvi Kapoor Jr NTR.. ప్చ్.! జాన్వీ తప్ప వేరే ఆప్షన్ లేదా.?
తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ల కొరత వున్నమాట వాస్తవం. రష్మిక, పూజా హెగ్దే మాత్రమే కనిపిస్తున్నారు. కీర్తి సురేష్ వున్నాగానీ, అన్ని సినిమాలకీ ఆమె సూట్ అవుతుందా.? అన్నది అనుమానమే.
Also Read: F3 Movie.. లేడీ కట్టప్పగా మారిన సోనాల్ చౌహన్.!
పైగా, ఎన్టీయార్ సినిమా పాన్ ఇండియా క్రేజ్‌తో రూపొందుతుంది గనుక, బాలీవుడ్ గ్లామర్ కూడా అవసరమే. ఆ లెక్కన జాన్వీ అయితే, సినిమాకి అదనపు అడ్వాంటేజ్ అవుతుందని చిత్ర దర్శక నిర్మాతలు భావిస్తుండొచ్చు.
మరి, ఈసారైనా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) టాలీవుడ్ ఎంట్రీ ఖాయమవుతుందా.? వేచి చూడాల్సిందే.