Kajal Aggarwal Son Neil.. అమ్మ ప్రేమకు ఆకాశమే హద్దు.! అమ్మ అయ్యాకే, ఆ మాతృత్వం గొప్పతనమేంటో తనకు తెలిసిందని సినీ నటి కాజల్ అగర్వాల్ మాతృత్వ దినోత్సవం రోజున పేర్కొంది.
మరో సినీ నటి ప్రియాంక చోప్రా కూడా తన గారాల పట్టిని మాతృత్వ దినోత్సవం రోజున పరిచయం చేసింది.
తొమ్మిది నెలల పాటు తన శరీరంలో అంతర్భాగమైన శిశువుకి జన్మనిచ్చాక, ఆ శరీర భాగం వేరు పడినా, ఆ భాగంతో, ఆ కొత్త జీవితో జీవితాంతం పెనవేసుకునే బంధం, ఆ ప్రేమ.. మాటల్లో వర్ణించలేం.
Kajal Aggarwal Son Neil.. అమ్మదనంలో కమ్మదనం.!
కాజల్ అగర్వాల్ ఈ విషయాన్ని చెబుతూ చాలా భావోద్వేగానికి గురయ్యింది. ‘అమ్మా, నేను కూడా తల్లినయ్యాకనే, నీ గొప్పతనాన్ని మరింతగా తెలుసుకోగలిగాను..’ అంటూ కాజల్ పేర్కొంది.

కోవిడ్ లాక్ డౌన్ సమయంలో నిరాడంబరంగా పెళ్ళి, ఆ తర్వాత కూడా సినిమాలకు కమిట్ అవడం, ఇంతలోనే గర్భం దాల్చి, పండంట మగబిడ్డకు కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) జన్మనివ్వడం తెలిసిన విషయాలే.
Priyanka Chopra.. కొత్త జీవితం ప్రారంభమైంది.!
ఇక, ప్రియాంక చోప్రా విషయానికొస్తే, ఆమె కథ వేరు. సహజ సిద్ధంగా ఆమె గర్భం దాల్చేందుకు అవకాశం లేకపోవడంతో, ప్రియాంక చోప్రా.. ఆమె భర్త నిక్ జోనాస్.. సరోగసీని ఆశ్రయించారు.
ఇటీవలే ప్రియాంక (Priyanka Chopra)- నిక్ దంపతులకు సరోగసీ విధానంలో అమ్మాయి పుట్టింది. తమ గారాల పట్టిని ప్రపంచానికి పరిచయం చేసేందుకు కొంత సమయం తీసుకున్నారు ప్రియాంక – నిక్ దంపతులు.
తమ చిన్నారి రాకతో తమ జీవితాల్లో కొత్త వెలుగులు కనిపిస్తున్నాయని ప్రియాంక చోప్రా పేర్కొంది.
Also Read: లక్కు తోక తొక్కిన సమంత.! ‘సుడి’ ఆ రేంజ్‌లో వుంది మరి.!
అటు కాజల్ (Kajal Agarwal), ఇటు ప్రియాంక.. తమ తమ చిన్నారులతో సోషల్ మీడrయాలో సందడి చేస్తోంటే, అభిమానులకు అంతకన్నా పండగ ఇంకేముంటుంది.?
అన్నట్టు, ప్రెగ్నెన్సీ దగ్గర్నుంచి.. కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా వుంటూ వచ్చింది.
గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతూ, ఆ రకంగా కూడా అభిమానులకి దగ్గరానే వుంది ఈ అందాల చందమామ.