Atheist Nagababu Becomes Devotee.. సినీ నటుడు, నిర్మాత, ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్సీ నాగబాబు నాస్తికుడు. ఈ విషయాన్ని ఆయనే పలు సందర్భాల్లో చెప్పుకున్నారు కూడా.! కానీ, అది ఒకప్పుడు.!
ఇకపై, నాస్తికుడు కాదు నాగబాబు.! ఎందుకంటే, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిపై అచంచల భక్తి విశ్వాసాలతో, తల నీలాలు సమర్పించుకున్నారు కాబట్టి.
అయినా, నాగబాబు అలా ఎలా మారిపోతారు.? ఇదేం పద్ధతి.? అంటూ, సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ జరుగుతోంది. రాజకీయ అవసరాల నిమిత్తం, ఇదో కొత్త నాటకం.. అన్నది కొందరి ఆరోపణ.
నాస్తికుడైనప్పటికీ నాగబాబు హిందువు.! సో, ఆ భగవంతుడి మీద అచంచలమైన భక్తి విశ్వాసాలు రాత్రికి రాత్రి నాగబాబుకి వచ్చేస్తే, అందులో వింతేముంది.?
అసలు విషయమేంటంటే, నాగబాబు తన మనవడు వాయివ్ తేజ్ సహా, కుమారుడు వరుణ్ తేజ్, కోడలు లావణ్య, కుమార్తె నిహారిక కొణిదెలను వెంటేసుకుని సతీ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
వాయువ్ తేజ్ కూడా తల నీలాలు సమర్పించాడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి. సాధారణంగా ‘పుట్టు వెంట్రుకలు తీయించడం’ అంటాం కదా.. అదే ఇది.
నాస్తికుడైనా.. చివరికి ఇతర మతాలకు చెందిన వారైనా సరే.. వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించి, విశ్వసించి, తల నీలాలు సమర్పించగలిగితే అంతకన్నా ‘మార్పు’ ఇంకేముంటుంది.?
కాదేదీ వివాదానికి అనర్హం.. అన్న చందాన, ప్రతి విషయంలోనూ నాగబాబుని వివాదాల్లోకి లాగాలని చూస్తుంటారు కొందరు.
‘నేను నాస్తికుడిని’ అని నాగబాబు చెప్పుకున్నప్పుడూ ట్రోలింగ్ జరిగింది.. ఇప్పుడేమో, నాగబాబు తల నీలాలు భక్తితో శ్రీవారికి సమర్పించుకున్నా ట్రోలింగ్ జరుగుతోంది.
గతంలో, టీటీడీ ఛైర్మన్ పదవిని నాగబాబుకి ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జరిగినప్పుడు, ‘నాగబాబు నాస్తికుడు కదా.. ఆ పదవి ఎలా ఇస్తారు.?’ అంటూ ప్రశ్నించారు కొందరు సోషల్ మీడియా వేదికగా.
ఇప్పుడేంటి.? నాగబాబుకి టీటీడీ ఛైర్మన్ పదవిని ఇవ్వొచ్చా.? నాగబాబు అయితే అప్పట్లో జరిగిన ప్రచారాన్నీ ఖండించారనుకోండి.. అది వేరే సంగతి.
