Valathu Vashathe Kallan Review.. జీతూ జోసెఫ్ తెలుసు కదా.? థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్.! భాషతో సంబంధం లేకుండా, దేశవ్యాప్తంగా జీతూ జోసెఫ్ సినిమాలకు అభిమానులున్నారు.
తెలిసిన కథనే, తనదైన థ్రిల్లింగ్ కథనంతో ప్రేక్షకుల్ని కట్టి పడేస్తాడు జీతూ జోసెఫ్.
ప్రముఖ మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన సినిమానే Valathu Vashathe Kallan గురించే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం.
ఈ సినిమాలో ఇద్దరు హీరోలున్నారు. ఒకరు మంచి హీరో, ఇంకొకరు చెడ్డ హీరో. చెడ్డ హీరోలోని మంచితనాన్ని చూపించే ప్రయత్నం చేస్తాడు మంచి హీరో.!
ఎత్తులకు పై ఎత్తులు.. చాలా సినిమాల్లో చూస్తాం. కానీ, జీతూ జోసెఫ్ సినిమాల్లో ఇంకాస్త భిన్నంగా వుంటాయ్.
Valathu Vashathe Kallan Review.. దర్శకుడు, నటీనటులు.. థ్రిల్లింగ్ ప్యాకేజ్..
జీతూ జోసెఫ్ దర్శకత్వ ప్రతిభకి బిజు మీనన్, జోజు జార్జ్ లాంటి నటనా ప్రతిభ వున్న నటులు తోడైతే, అది వేరే లెవల్.!
కూతుర్ని పోగొట్టుకున్న తండ్రి, కూతురు మరణానికి కారణమెవరన్నదాన్ని కనుగొనడానికి నడుం బిగిస్తాడు. ఇదే కథ.! ఓ తెలివైన క్రిమినల్ పోలీస్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ మధ్య నడిచే గేమ్ ఇది.
కరప్టడ్ అని తెలిసీ, పోలీస్ అధికారికి ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ఇది కూడా చాలా సినిామల్లో చూసిందే. కానీ, ఇందులోనూ ఓ ట్విస్ట్ వుంటుంది.
చివర్లో, కొడుకుని కాపాడుకునే అవకాశం వున్నా, కొడుకు చేసిన నేరం తాలూకు తీవ్రత తెలిసి, కొడుకు వల్ల సమాజానికి హాని జరుగుతుందని తెలిసి చేతులెత్తేస్తాడు పోలీస్ అధికారి.
అప్పటిదాకా, పోలీస్ అధికారిగా తన అనుభవాన్నంతా రంగరించి మరీ, కొడుకుని కాపాడుకోవడానికి అతను చేసే ప్రయత్నం, అతని చుట్టూ వున్న సిబ్బందికే ఆశ్చర్యం కలిగిస్తుంది.
కన్విన్సింగ్ స్క్రీన్ ప్లే..
అధికారి తప్పు చేస్తున్నాడని తెలిసినా, ఓ ప్రాణం కాపాడటం పోలీసుగా తమ బాధ్యత.. అని, ఆ అధికారికి సిబ్బంది సహకరించడాన్ని కన్విన్సింగ్‌గా చెప్పడంలో దర్శకుడు సఫలమయ్యాడు.
జోజూ జార్జ్ పాత్ర మధ్యలోనే చనిపోతుంది. కానీ, చివరి వరకూ ఆ పాత్ర ఎగ్జిస్ట్ అయి వుందన్న ఫీల్ మనకి కలిగేలా చేయగలిగాడు దర్శకుడు జీతూ జోసెఫ్.
నటుడిగా బిజూ మీనన్ మన తెలుగు ప్రేక్షకులకీ సుపరిచితుడే. తన నటనా ప్రతిభతో ఆకట్టుకున్నాడు. జోజూ జార్జ్ గురించి తెలిసిందేగా.!
సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. సాధారణ సన్నివేశాల్నీ వేరే స్థాయికి తీసుకెళ్ళేలా చేసింది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అనలేంగానీ, ఆ స్థాయిలోనే అలరిస్తుంది.
హీరో అంటే అలా వుండాలి, విలన్ అంటే ఇలానే వుండాలి.. హీరోయిన్ లేకపోతే, సినిమాలు కష్టం. ఐటమ్ సాంగ్స్ వుండాలి. డబుల్ మీనింగ్ డైలాగులు లేకపోతే ఎలా.? ఈ ఈక్వేషన్స్‌కి దూరం ఈ సినిమా.
వల్గర్ కోణం టచ్ చేయలేదు, హింస విషయంలోనూ బౌండరీలు దాటలేదు. చేసిన తప్పు, పశ్చాత్తాపం.. నేరము, శిక్ష.. ఇదీ సినిమా సాగిన తీరు.
