Kota Srinivasa Rao చావు వార్తలకి వున్న గిరాకీ అంతా ఇంతా కాదు.! అందుకే, ముందే చంపెయ్యడం మీడియాకి బాగా అలవాటైపోయింది.!
ప్రముఖులెవరైనా ఆసుపత్రిలో చేరితే చాలు.. పరిస్థితి అత్యంత విషమం అని ప్రచారం చేయడమో.. లేదంటే, చచ్చిపోయారంటూ బ్రేకింగ్ న్యూస్‌లు ఇచ్చేయడమో మామూలైపోయింది.
తమ ఇంట్లో ఎవరికైనా అలాంటి పరిస్థితి వస్తే తామెంతగా చలించిపోతామన్న కనీస విజ్ఞతని మీడియా ప్రతినిథులు, మీడియా సంస్థలు విస్మరిస్తుండడం శోచనీయం.
Kota Srinivasa Rao కోట శ్రీనివాసరావుని చాలాసార్లు చంపేశారు..
వృద్ధాప్య సమస్యలు ఎదుర్కొంటున్నారు కోట శ్రీనివాసరావు చాలాకాలంగా. తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారాయన.
అయినా, ఇంకా కోట తరచూ సినిమాల్లో నటిస్తూనే వున్నారు. సంపూర్ణ ఆరోగ్యం.. అనలేంగానీ, బాగానే వున్నారు. కానీ, ఆయన్ని చంపేసింది సోషల్ మీడియా.!
కడుపుకి అన్నమే తింటున్నారా.? అశుద్ధం తింటున్నారా.?
అన్నమే తింటోంటే.. ఇలాంటి దుష్ప్రచారాలు చెయ్యరు.!
బతికున్నోళ్ళు.. తాము బతికే వున్నామని చెప్పుకోవాల్సి రావడం.. అదీ లేటు వయసులో… అత్యంత బాధాకరం.!
కోట శ్రీనివాసరావు లాంటి సీనియర్ విషయంలో.. ఎందుకీ విషపు రాతలు.?
Mudra369
వెబ్ మీడియాలోనూ కోట మరణానికి సంబంధించిన వార్తలొచ్చేశాయ్. మీడియాలోనూ అక్కడక్కడా ఈ తరహా వార్తలు కనిపించాయి.
దాంతో, కోట స్పందించక తప్పలేదు. ‘నేను బతికే వున్నాను..’ అంటూ స్వయంగా కోట శ్రీనివాసరావు ఓ వీడియో విడుదల చేయాల్సి వచ్చింది.
ఇదేం ఖర్మ.?
బతికున్న వ్యక్తి తాను బతికే వున్నానని చెబుతూ విడియో విడుదల చేయాల్సిన పరిస్థితి రావడమేంటో.? సమాజంలో పైశాచికత్వమెలా పెరిగిపోతోందో చెప్పడానికి ఇదొక నిదర్శనం.
Also Read: మాస్ అమ్మ మొగుడు.! ఎన్టీయార్‌కే ధమ్కీ ఇచ్చినవ్.!
సమాచారం సరైనదో కాదో తెలుసుకోకుండా పోలీసులు కూడా వచ్చేశారట.! ఇది మరీ చోద్యం.!