Krithi Shetty Stardom.. ఈ మధ్య బేబమ్మ కృతి శెట్టికి ఏం చేసినా కలిసి రావడం లేదు. వరుసగా బోలెడన్ని సినిమాలు చేసేసింది. కానీ, బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌లు కొట్టింది.
అవకాశాలు వచ్చాయ్ కదా.. అని వచ్చిన ప్రతీ అవకాశాన్నీ అంది పుచ్చేసుకుంది. కంటెంట్, కాకరకాయ్తో సంబంధం లేకుండా ఏ సినిమా పడితే ఆ సినిమా చేసేసింది.
చివరికి ఏమైంది. కనీసం ఒక్క సినిమా కాకుంటే ఒక్క సినిమా అయినా హిట్ కొట్టలేకపోయింది. ఒకే ఒక్క సినిమా మొదటి సినిమా ‘ఉప్పెన’తో తిరుగులేని క్రేజ్ దక్కించుకుంది.
Krithi Shetty Stardom.. అదే కృతి కొంప ముంచేసింది..
ఆ క్రేజే కృతి శెట్టికి ఇన్ని వరుస అవకాశాలు రావడానికి కారణమైంది. కానీ, ఇప్పుడు పరిస్థితి వేరే. ముందూ వెనకా ఆలోచింకుండా తీసుకున్న నిర్ణయాలు పాపం కృతి శెట్టి కొంప ముంచేశాయ్.
ఐరెన్ లెగ్ ముద్ర వేసేశాయ్. కృతి శెట్టి చెయ్యి పడితే ఆ సినిమా మటాషే అనేలా తయారైంది పరిస్థితి. దీంతో కంప్లీట్ నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేసింది కృతి శెట్టి మీద.

దాంతో సోషల్ మీడియాలో ఐరెన్ లెగ్ కృతి శెట్టి అంటూ దారుణంగా ట్రోల్స్ జరుగుతున్నాయ్. అయితే సినిమా సక్సెస్, ఫెయిల్యూర్స్‌లో హీరోయిన్ పాత్ర ఎంత.?
తప్పంతా హీరోయిన్‌దే అనేస్తే ఎలా.?
నిజంగా చెప్పాలంటే చాలా చాలా తక్కువ. కథల్లో దమ్ము లేకపోతే హీరోయిన్ ఏం చేస్తుంది.? కృతి శెట్టి విషయంలోనూ అదే జరుగుతోంది అనుకోవచ్చుగా.
అయితే, అలా అని కృతి శెట్టి (Krithi Shetty) సరిపెట్టుకోకూడదు. కథల ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇప్పటికీ కృతి శెట్టికి అవకాశముంది.
Also Read: Pavitra Naresh.. ‘మళ్లీ పెళ్లి’.! బోలెడంత ‘ముదురు ప్రేమ’ కథ.!
ఇంతవరకూ జరిగిన తప్పులు ఇకపై జరగకుండా అప్రమత్తమయితే, ఆమె కెరీర్ మళ్లీ గాడిన పడే అవకాశాల్లేకపోలేదు.. అంటూ ఆమె అభిమానులు, సన్నిహితులు సూచిస్తున్నారు.
వస్తున్నాయ్ కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పేసుకుంటే రిజల్ట్ ఇలాగే వుంటుంది.. అని కృతి శెట్టిని అనేయలేం కానీ, ఆమెకీ బాధ్యత వుండాలిగా.!